— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Grain Transport :ప్రజా దీవెన, కొండ మల్లేపల్లి:ధాన్యం సేకరణలో జాప్యం జరగ కుండా రైతులకు ఇబ్బంది కలగకుం డా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లు లకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ శాసనస భ్యులు బాలు నాయక్ లు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిశేర్లపల్లి లో ఏ ర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకర్స్మికంగా తనిఖీ చేశా రు.
ఇక్కడ లారీల సమస్య ఉందని తె లుసుకొని ప్రతిరోజు ఆరు లారీలు ఏర్పాటు చేసి వచ్చిన దాన్ని వచ్చి నట్లే మిల్లులకు పంపించాలని జి ల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సం దర్భంగా ఆమె ధాన్యం తేమ శాతా న్ని, సౌకర్యాలను, తాలు, తరుగు ను పరిశీలించారు. అంతేకాక రికా ర్డుల నిర్వహణ సైతం పరిశీలిoచా రు.
శాసనసభ్యులు బాలు నాయక్ మాట్లాడుతూ లారీ కాంట్రాక్టర్ సరైన సమయంలో లారీలు పంపే విధంగా ఆదేశించాలని జిల్లా కలెక్టర్ తో కోరారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారా యణ్ అమిత్ ,ఆర్డీవో రమణారె డ్డి ,జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్, డిఎస్ఓ వెంకటే శ్వర్లు, పిఎ సిఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, తదిత రులు ఉన్నారు.