ఛీ ఏమి బతుకురా, స్మశాన వాటికలో దొంగలు పడ్డారు
Graveyardtheft: ప్రజా దీవెన, మహబూబ్ నగర్: దొంగలకు దొరికిందే తడవు అన్న ట్లు ఏ దొంగతనం చేస్తున్నారో సో యిలేకనా లేకపోతే ఇంత కక్కుర్తా అంటూ ప్రజల్లో చర్చ జరుగుతోంది.స్మశాన వాటికలో దొంగలు పడారం టా ఆలస్యం వెలుగులోకి వచ్చింది. మ హబూబ్ నగర్ కేటిదొడ్డి మండ లంలోని ఓ గ్రామ పంచాయతీకి చెం దిన స్మశాన వాటికలో ఉన్న విద్యుత్ మోటార్ గుర్తుతెలియని వ్య క్తులు చోరీ చేశారు. తెలిసి చేశారా తెలియక చేశారా అనేది ప్రశ్నగా మారింది.
అదే విధంగా గ్రామంలో చెత్త సేకరించేందుకు ఉపయోగించే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ట్రాలీ టై ర్లు కొత్తవి మార్చి పాతవి వేశారం టూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శిని వివర ణ కోరగా స్మశాన వాటిక గేట్లు తెరుచుకోవడం వల్ల ఎవరైన ఎత్తు కెళ్తారేమో అని ముందు జాగ్రత్తగా గ్రామానికి చెందిన వాటర్ మెన్, మరో ఇద్దరు భద్రంగా తీసిపెట్టారంటూ రేపోమాపో స్మశానవాటిక లో ఫిట్ చేస్తారంటూ తేలికగా సమాధానం ఇచ్చారు.
మండలాధికారికి ఫిర్యాదు చేయడంతో గ్రామాధికారి ఇలా చెప్పుకో వడం ఆశ్చ ర్యంగా ఉంది. ఇంతకు స్మశాన వాటికలో ఉన్న విద్యుత్ మోటార్ ఏమైనట్లు గ్రామ సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో పంచాయతీ కార్యదర్శులు గ్రామాన్ని పర్యవేక్షి స్తున్నారు. పంచాయతీ కార్యద ర్శు లు తమ విధులు ముగించుకుని వెళ్లిపోవడంతో గ్రామా లలో పర్య వేక్షణలేక గ్రామ పంచాయతీకి సం బంధించిన వస్తువులు దొంగలు ఎత్తుకెళ్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.