– పెట్టుబడి డబ్బు వారంలో రెట్టింపు అంటూ సోషల్ మీడియాలో ప్రముఖుల ఇంటర్యూలతో నకిలీ వీడియోస్.
– ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) ద్వారా సృష్టించిన నకిలీ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్, అప్రమత్తంగా ఉండండి.
– ప్రజా ఆదరణ రాజకీయ, సినీ, క్రీడాకారుల, ఉద్యోగ, కేంద్ర సర్వీసెస్ ప్రముఖ వ్యక్తుల యొక్క వీడియోలు సృష్టిస్తున్నారు.
– ఇది సైబర్ మోసగాళ్ళ పన్నాగం అని గుర్తించడండి.
– అత్యాశకు పోయి ఆర్థికంగా నష్టపోవద్దు.
కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట
K. Narasimha IPS, SP : ప్రజాదీవెన, సూర్యాపేట : ప్రస్తుత సమాజంలో సాంకేతికత బాగా అభివృద్ధి చెందినది, ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ తో కూడిన అత్యాధునిక మొబైల్స్ అందుబాటులో ఉంటున్నాయి, ప్రజల ఆశను, అవసరాలను, అవగాహన లోపాన్ని అవకాశంగా చేసుకుని కొత్త తరహాలో సైబర్ మోసగాళ్ళు ప్రజలను మోసం చేస్తూ డబ్బులు దోసెచేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రముఖ వ్యక్తుల, ప్రజా ఆదరణ పొందిన వ్యక్తుల యొక్క నకిలీ వీడియోస్ సృష్టించి సైబర్ మోసగాళ్ళు ప్రజలను ఆర్థిక మోసాలకు గురి చేస్తున్నారు అని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ గారు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా సృష్టించిన నకిలీ వీడియోస్ సోషల్ మీడియాలో అనగా ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పబ్లిక్ యాప్ ఇలా రకరకాల సోషల్ మీడియా యాప్ ల నందు వైరల్ చేస్తున్నారు.
ప్రజా ఆదరణ పొందిన రాజకీయ, సినీ ప్రముఖుల, క్రీడాకారుల, ఉన్నత స్థాయిలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగుల, కేంద్ర సర్వీస్ లో ఉన్న ఉద్యోగుల, ప్రముఖ సంస్థల ఛైర్మెన్ ల, సామాజిక సేవలో ఉన్న వ్యక్తుల యొక్క వీడియోలను సృష్టించి ప్రభుత్వ పతకాలు, మ్యుచువల్ ఫండ్స్, బ్యాంకింగ్ రంగాలు, ఫీక్షుడ్ డిపాజిట్, ఆన్లైన్ ట్రేడింగ్, షేర్స్ కొనడం మొదలగు వాటిలో డబ్బులు పెట్టుబడి పెట్టగా వారం రోజుల్లో అవి రెట్టింపు అవుతాయి, మంచి లాభం వస్తాయి అని మీరు పెట్టుబడులు పెట్టి లాభాలు పొందండి అని వీడియోలు సృష్టించబడుతున్నాయి. వీటిని చూసిన చాలామంది అమాయక ప్రజలు అత్యాశకు పోయి పెట్టుబడులు పెట్టీ ఆర్థికంగా నష్టపోతున్నారు అని ఎస్పీ గారు తెలిపారు.
ఇలాంటి వీడియోలు నుండి ప్రజలు అప్రమత్తంగా ఉంది ఎవరు ఆర్థిక మోసాలకు గురి కావొద్దు అని కోరారు.