Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Srinivas : ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి

–అదనపు కలెక్టర్ శ్రీనివాస్

Collector Srinivas : ప్రజాదీవెన నల్గొండ : ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని రెవెన్యూ ఆదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో ఆయన మాట్లాడుతూ విపత్తు నిర్వహణకు సంబంధించి ఆయా శాఖలు వారి కార్యాచరణ ప్రణాళికను వారం రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించారు.

ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని, ఒకవేళ సమస్య పరిష్కారం కానట్లయితే సంబంధిత ఫిర్యాదు దారుకి తెలియజేయాలని, డివిజన్ ,మండల గ్రామస్థాయిలో సైతం ఇదేవిధంగా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు.
కాగా ఈ సోమవారం 130 ఫిర్యాదులు రాగా, జిల్లా అధికారులకు 61, రెవెన్యూ శాఖకు 69 ఫిర్యాదులు వచ్చాయి. స్పెషల్ కలెక్టర్ సీతారామారావు, జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.