— గ్రూప్-1 మెయిన్స్‌కు మొత్తం 31వేల 382 మంది క్వాలిఫై
–1:50 రేషియో ప్రకారం మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేశారు.
Group -1 Exam:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ గ్రూప్-1 (Group -1 Exam) ప్రిలిమినరీ పరీక్ష ఫలి తాలు విడుదల (results released) చేశారు. 1:50 రేషి యో ప్రకారం మెయిన్స్‌కు అభ్యర్థు లను ఎంపిక చేయగా గ్రూప్-1 మెయిన్స్‌కు మొత్తం 31వేల 382 మంది క్వాలిఫై అయ్యారని అధి కారులు వెల్లడించారు. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో (website)అభ్యర్థుల జాబితా, కటాఫ్ మార్కుల వివరాలు పొందుపరిచారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఉంటుందని చెప్పా రు.563 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నియామకాలు చేపట్టింది తెలంగాణ సర్కార్(Telangana Sarkar).
గ్రూప్-1 మెయిన్స్‌కు (group 1mains)వారం రోజుల ముందు హాల్ టికెట్స్ (hall tickets) జారీ చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాల కోసం టీజీ పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.కాగా టీజీపీఎస్సీ మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు ఈ ఏడాది ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ (notification)జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రిలి మినరీ పరీక్ష జూన్ 9న ఉదయం నిర్వహించింది. అక్టోబర్ 21 నుం చి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. అయితే మెయిన్స్ పరీక్షకు మల్టీజోన్ 1, 2 వారీగా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని తొలి నుంచి అభ్యర్ధులు డిమాండ్ చేస్తు న్నారు. అయితే ప్రభుత్వం ప్రతి మల్టీజోన్‌లో ఉద్యోగాల సంఖ్య ఆధారంగా 1:50 నిష్పత్తిలో మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఉం టుందని స్పష్టం చేయడంతో నిరు ద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.