ప్రజా దీవెన, నాగర్ కర్నూల్: ఉద్యోగం సాధించాలన్న తపనతో ఓ నిండు గర్భిణి గ్రూప్-2 పరీక్షలు రాస్తుండగా పరీక్ష హాల్లోనే పురిటి నొప్పులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తనకోసం ప్రత్యేకమైన అంబులెన్స్, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి అత్యవ సరమైతే అక్కడే ప్రసవం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. సోమ వారం గ్రూప్-2 మొదటి పేపర్ రాసి, రెండో పేపర్ కూడా రాస్తానం టూ గర్భిణీ మొండికేయడంతో వైద్య సిబ్బంది ధైర్యంగా అక్కడే ఉంటూ ప్రసవం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద సోమవారం చోటు చేసుకుంది. బాల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి (25) రెండో కాన్పు నిండు గర్భిణీ. వైద్యాధికారులు కూడా కాన్పు సమయమని చెప్పారు.కానీ చాలాకాలంగా ప్రభు త్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం తో, కష్టపడి చదివి గ్రూప్-2 పరీక్షల కోసం వేచి చూసింది. పురిటి నొప్పులతో బాధపడుతూనే ఎలా గైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిం చాలన్న పట్టుదలతో పరీక్షలు రాస్తుంది.
మొదటి రోజు సాపీగానే పరీక్షలు రాయగా సోమవారం మాత్రం ఉదయం సమయంలో పరీక్షలు రాస్తుండగా పురిటి నొప్పులు రావడంతో, గమనించిన పాఠశాల సిబ్బంది వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసారు. జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ దృష్టికి తీసుకువెళ్లడంతో తనకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో ప్రత్యేక అంబులెన్స్, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి, తప్పని పరిస్థితుల్లో ప్రసవ కోసం ఏర్పాట్లు చేశామని ఆమెకు ధైర్యం చెప్పారు. తీవ్రమైన పురిటి నొప్పులను అనుభవిస్తూనే పరీక్షలు రాస్తుండడం అందరినీ కలిచి వేసింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Next Post