Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Group 2 Exams: ట్రాఫిక్ పోలీసుల ఔదార్యం, పరీక్షకు ఆలస్యమైన మహిళను పరీక్షా కేంద్రానికి చేర్చిన పోలీసులు

ప్రజా దీవెన షాద్ నగర్: గ్రూప్ 2 పరీక్షల సందర్భంగా అభ్యర్థులు పరీక్షల కోసం సరైన సమయంలో హాజరు కావలసి ఉంటుంది. రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో గ్రూప్ 2 మహిళ అభ్యర్థి పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు కొన్ని నిమిషాలే మిగిలి ఉండడంతో ఆందోళన చెందుతుండగా సదరు మహిళ ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించింది. స్థానికంగా దేవి గ్రాండ్ సమీపంలో మహిళా ఆందోళనకు గురై కనిపించింది. ఓ కళాశాలకు తొందరగా వెళ్లాలని అక్కడే ఉన్న ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ ను వేడుకోవడంతో ఆయన వెంటనే పెట్రోలింగ్ వాహనంలో ఆమెను సకాలంలోనే కళాశాల పరీక్షా కేంద్రం వద్ద వదిలిపెట్టారు. దీంతో ఆ మహిళ ట్రాఫిక్ పోలీసు సేవలకు కృతజ్ఞతలు తెలిపింది.

డిసెంబర్ 15న ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు, 16వ తేదీన ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంట ల వరకు పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్ష కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనల ప్రకారం అభ్యర్థులు వ్యవహరించాల్సి ఉంటుంది.మొబైల్ ఫోన్స్, ఎల క్ట్రానిక్స్, స్మార్ట్ వాచీలు వంటి వస్తువులతో రాకూడదన్నారు. కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించడంతోపాటు జీరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు.

కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకో వాలని, టాయిలెట్స్, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పొరపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించేలా అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది.