Guinness World Records: ప్రజా దీవెన దేవరకొండ: క్రోచెట్ ఈవెంట్‌తో దేవరకొండ పట్టణానికి చెందిన వీరమళ్ళ కృష్ణయ్య కుమార్తె గుండా సంతోషి (Gunda Santhosi) బృందం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (Guinness World Records) కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ (Vizag) పట్టణంకు చెందిన మహిళా మనో వికాస్ క్రోచెట్ (Mano Vikas Crochot) ఈవెంట్‌తో దేవరకొండ (Devarakonda) పట్టణానికి చెందిన వీరమళ్ళ కృ ష్ణయ్య కుమార్తె గుండా సంతోషి బృందం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణంకు చెందిన మహిళా మనోవికాస్-అండ్ క్రియేషన్స్ ఆధ్వరంలో ఏటా నిర్వహించే క్రొచెట్స్ తయారీలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. అందులో స్థానం పొందిన వారిలో దేవరకొండ పట్టణానికి చెందిన వీరమళ్ళ కృష్ణయ్య గా కుమార్తె గుండా సంతోషి ఉన్నారు. ఆసంస్థ గత యేడాది నవంబరు నుంచి ఈ సంవత్సరం ఆగష్టు వరకు మొత్తం 450 మంది అన్ని వయసుల చిన్నారులు, యువతులు మహిళ లు వుద్దులతో కలిసి అతి తక్కవ సమయంలో 58, 112 తో క్రోచెట్ – సేశ్వరన్ను ప్రదర్శించారు. వాటిని గిన్నిస్ రికార్డు లండన్ ప్రతినిధి స్వప్నిల్ డంగారికర్ పరిశీలించి లార్జెస్ట్ డిస్ప్లే ఆప్ ప్రొంపెట్స్క్వెర్స్ గా గిన్నిస్ రికార్డును ద్రువీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిన్నిస్ రికార్డుకోసం సాధారంగా 20 వేల క్రిచెట్ స్క్వెర్ తయారు చేయాల్సి ఉండంగా 58,112 తయారు చేసి, అతిపెద్ద (ప్రదర్శనను ప్రదర్శించి గిన్నిస్ గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించారని తయారుచే “మహిళా మనో వికాస్” బృందాన్ని ఆయన ప్రశసించారు. వీటిని స్వెర్టర్స్, శాలువాలు తయారు చేసి నిరుపేదలు, అనాథలకు ఉచితంగా పంపీణి చేస్తారన్నారు. ఇంతటి ఘనత సాధించిన దానిలో దేవరకొండకు చెందిన “గుండా సంతోషి” పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, దేవరకొండ ప్రజలు అభినందనలు తెలియజేశారు.