Warangal Mayor:ఇక వరంగల్ మేయర్ వంతు కాంగ్రెస్ లోకి గుండు సుధారాణి..?
బిఆర్ఎస్ పార్టీని మరో కుదుపు కుదిపింది. వరంగల్ కు చెందిన కీలక నేత బి ఆర్ ఎస్ ను వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైన ట్లు సమాచారం.
కేటిఆర్ పర్యటనకు గుండు గైర్హా జరు
తాజాగా సీఎం రేవంత్ ను కలిసిన వైనం
వరంగల్ రాజకీయాల్లో సంచల నం
ప్రజాదీవెన, వరంగల్: బిఆర్ఎస్ పార్టీని మరో కుదుపు కుదిపింది. వరంగల్ కు చెందిన కీలక నేత బి ఆర్ ఎస్ ను వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైన ట్లు సమాచారం. ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా వారేనండి గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి. (Gundu sudharani)ఆమె గడిచిన కొద్ది కాలం గా సైలెంట్ గా ఉండడంతో ఉన్నపలంగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎ స్‌లో ఉన్నట్టా, లేనట్లా అనే చర్చో పచర్చలు జోరుగా సాగుతు న్నాయి.
లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ (BRS)పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పర్యటనకు ఆమె డుమ్మా కొట్టడమే ఈ అనుమానా లకు తావిస్తుంది. దీంతో పార్టీ కార్యక్రమాలకు సుధారాణి దూరం గా ఉంటూ వస్తుండడం వెనుక కారణాలు వెతుకుతున్నారు బి ఆర్ ఎస్ నేతలు. బీఆర్ఎస్ ఫ్లెక్సీలలో ఆమె ఫోటోలు వద్దును కొనే తొలగించారా, లేదంటే పార్టీ మారే అవకాశాలున్నాయని నిర్ధారించుకొని తీసివేశారా అన్న చర్చలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గరం గరం గా కొనసాగిస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వరంగల్ పర్యటనతో మేయర్ గుండు సుధారాణి రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. వరంగల్ తూర్పు నియోజక వర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి మేయర్ గుండు సుధారాణి డుమ్మా కొట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వరంగల్ జిల్లాలోనే వర్ధన్నపేట, వరంగల్ తూర్పు (Warangal East)నియోజక వర్గాల బీఆర్ఎస్ సమావేశం మంగళవారం జరిగింది.
ఈ సమావేశాల నేపథ్యంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా కేటీఆర్‌కు స్వాగతం పలుకు తూ సమావేశాల దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో మేయర్ సుధారా ణి ఫోటో ఎక్కడ దర్శనం ఇవ్వకపో వడంతో చర్చ ప్రారంభమైంది. ఇంతకు మేయర్ సుధారాణి బీఆర్ ఎస్ పార్టీలో ఉన్నట్ట,లేనట్టా అని జిల్లాలో చర్చ జరుగుతుంది.బీఆర్ఎస్ వర్గాలలో కూడా రకరకా ల గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే కుమారుడుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy)మేయర్ గుండు సుధారాణి కలిసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే గుండు సుధారాణిని బీఆర్ఎస్ పార్టీ పక్క న పెట్టిందనే చర్చ జరుగుతుంది. త్వరలోనే పార్టీ మారుతారన్న వార్తల నేపధ్యంలో బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఆమె దూరం అవుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తుంది. తాజా పరిణామాలు చూస్తుంటే వరంగల్ మహానగరం లో రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి.
Gundu Sudharani join congress