ప్రజాదీవెన, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి సౌజన్యంతో, వారి అబిడ్స్ రోడ్, బషీర్ బాగ్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విజయ డైరీ పార్లరును,తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పోరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విజయ డెయిరీ ద్వారా తొందర్లో తెలంగాణ వ్యాప్తంగా మరిన్ని డెయిరీ పార్లర్లు ప్రారంభించాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం అని గుత్తా అమిత్ రెడ్డి అన్నారు.