Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Guru Pujotsavam celebrations: తేజ టాలెంట్ పాఠశాలలో గురుపూజోత్సవం వేడుకలు.

Guru Pujotsavam celebrations: ప్రజా దీవెన, కోదాడ: పట్టణములోని స్థానిక తేజ టాలెంట్ పాఠశాలలో (Teja Talent School) సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలతో అలంకరించి ఉపాధ్యాయ దినోత్సవమును జరుపుకున్నారు. విద్యార్థులందరూ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు (Best wishes to the teachers)తెలియజేశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడారు. దేశ భవిష్యత్తు నేటి విద్యార్థుల (The future of the country is today’s students)పైనే ఆధారపడి ఉంటుందని, నేటి విద్యార్థులే రేపటి నవ సమాజ నిర్మాతలు అని తెలియచేశారు. అలాంటి విద్యార్థులకు విద్యను బోధించడం కేవలం వృత్తి మాత్రమే కాదని, ఇది ఒక సామాజిక బాధ్యత అని,ఇలాంటి వృత్తిలో ఉన్నందుకు గర్వపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమములో పాఠశాల ప్రిన్సిపల్ అప్పారావు , సెక్రటరీ సంతోష్ కుమార్ , వైస్ ప్రిన్సిపల్ సోమా నాయక్ , ప్రైమరీ ఇంచార్జ్ రేణుక మరియు ఇతర ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.