Gurupurnima:ప్రజా దీవెన, నల్లగొండ: గురుపూర్ణిమ (Gurupurnima)సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Komati Reddy Venkata Reddy) రాష్ట్ర ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలి యజే శారు.గురుపూర్ణిమను పురస్క రిం చుకొని ఆదివారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి (ramagiri)లో ఉన్న సాయిబాబా దేవాలయాన్ని సంద ర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించా రు.ఈ సందర్భంగా మంత్రి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.
మంత్రి (Komati Reddy Venkata Reddy)మాట్లాడుతూ రాష్ట్ర అభి వృద్ధికి తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని, ఇందులో భాగంగా రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ (farmer loan waiver)కింద 32 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు తెలిపారు. రామగిరి దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, భక్తులకు అవసరమైన మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నల్గొండ జిల్లా తో పాటు, నల్గొండ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పు డూ కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస రెడ్డి, మాజీ జెడ్పి టిసి, ఇతర ప్రజాప్రతినిధులు, ఆర్డిఓ రవి, డిఎస్పి శివరాంరెడ్డి, స్థానిక తహసిల్డర్ శ్రీనివాస్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.