–తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Gutta Sukhender Reddy:ప్రజా దీవెన, దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దివంగత నేత కటికనేని లక్ష్మణ్ రావు (lakshana Rao)80 వ జయంతి సందర్భంగా అంగడిపేట క్రాస్ రోడ్ వద్ద లక్ష్మణ్ రావు విగ్రహా న్ని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy), మాజీ మంత్రి జానారెడ్డి , దేవరకొండ ఎమ్మె ల్యే బాలునాయక్ (balu nayak) ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) మాట్లాడుతూ ప్రజల మనిషి లక్ష్మణ్ రావు విగ్రహాన్ని ఆవిష్కరిం చడం చాలా సంతోషంగా ఉందన్నా రు. మా నీళ్లు మక్కావాలి అని కృష్ణా జల సాధన ఉద్యమం లో కీలక పాత్ర పోషించి ముందుకు నడిపించారని తెలిపారు. దేవర కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అలాగే వివిధ హోదాలో పని చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని ఆయన చెప్పారు. ఆయన ఎప్పుడూ కలిసిన ప్రజల సమస్యల గురించే వివరించేవారని ఆయన తెలిపారు. ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు మనలో సజీవంగా బ్రతికే ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయన జన్మదినం సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల మోతు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ కోటి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, ఎంపీపీలు ప్రతాప్ రెడ్డి, పా ల్వాయి వెంకటేశ్వర్లు, జానీ యాద వ్, యాదగిరి రావు , దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సిం హా, స్థానిక ప్రజాప్రతినిధులు, బంధువులు, కుటుంబ సభ్యులు , దుస్సర్ల సత్యనారాయణ, దేవర కొండ మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.