Gutta Sukhender Reddy : ప్రజాదీవెన, చిట్యాల : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ఉన్న గాంధీ గుడి ఆలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మహాత్మా గాంధీ సంస్మరణ సభకి హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ “మహాత్మా గాంధీ జీవితం నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. ఆయన తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందడంతోనే దేశం అభివృద్ధి జరుగుతుందని అయన సంకల్పించారని వివరించారు .
గాంధీజీ సూచించిన మార్గం సత్యం , అహింస , మార్గంలో నడవాలని సుఖేందర్ రెడ్డి సూచించారు. పెద్ద కాపర్తి గ్రామంలో ఉన్న గాంధీ ఆలయానికి ప్రతి ఏటా వచ్చి ఆయన్ని సందర్శించుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వనమ వెంకటేశ్వర్లు , పొలగొని స్వామి , యాదగిరి , పల్లపు బుద్ధుడు , సైదులు , శ్రీను , గాంధీ గుడి ట్రస్ట్ చైర్మన్ భూపాల్ రెడ్డి , కమిటీ సభ్యులు , విద్యార్థులు, తదితరులు కూడా పాల్గొన్నారు .