మండలి ప్రాంగణంలో జెండావిష్కరించిన గుత్తా
ప్రజా దీవెన/హైదరాబాద్: జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దండే విఠల్, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, బోగరపు దయానంద్ , తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు, బి ఆర్ యస్ ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.