H. M. Musham Srinivasulu : ప్రజా దీవెన శాలిగౌరారం :ప్రభుత్వ పాఠశాలల్లో నే అన్ని రకాల వసతులు ఉంటాయని శాలిగౌరారం మండలం మనిమద్దె జడ్పి స్కూల్ హెచ్ ఎం ముషం శ్రీనివాసులు అన్నారు. బడిబాట కార్యక్రమం లో భాగంగా మనిమద్దె, నూలగడ్డ కొత్తపల్లి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి,ఇంటింటా ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రముఖ్యాన్ని తల్లీ దండ్రులకు హెచ్ ఎం శ్రీనివాసులు వివరించారు.
ప్రభుత్వ పాఠశాలలో అనువభగ్యులైన ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను భోదిస్తారని ప్రతీ తల్లి దండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలన్నారు.అనంతరం మనిమద్దె హైస్కూల్ లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థులకు ప్రగతి పత్రములను అందజేశారు. ఈ కార్యక్రమం లో అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మెన్ రమా శ్రీశైలం,ఉపాధ్యాయులు సహజ,భాస్కర్ రెడ్డి,శ్రీనివాస్, వెంకటేశ్వర్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.