Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

H.M.S. Kalpana : లక్ష్మీపల్లిలో అట్టహాసంగా ప్రగతి పత్రాల ప్రదానోత్సవం

H.M.S. Kalpana : ప్రజా దీవెన, దేవరకద్ర: దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠ శాల లోబుధవారం విద్యార్థులకు ప్రగతి పత్రాల ప్రదానోత్సవ కార్య క్రమం అట్టహాసంగా జరిగింది. 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలకు ఆఖరి పనిదినం సందర్భంగా పాఠశాల హెచ్ ఎం ఎస్.కల్పన అధ్యక్షతన విద్యార్థుల తల్లిదండ్రుల సమా వేశం జరిగింది.

ఈ సందర్భంగా లక్ష్మీ పల్లి ప్రాథమి క పాఠశాలలో ఈ విద్యా సంవ త్స రంలో 1 నుంచి 5 వ తరగతి వర కు విద్యను అభ్యసించి ఆయా తర గతుల్లో ఉత్తీర్ణత ను సాధించిన విద్యార్థులకు ప్రగతి పత్రాల ను ప్రదానం చేశారు. అనంతరం హెచ్ యం కల్పన మాట్లాడుతూ పాఠ శాలలో 2024-25విద్యా సంవత్స రంలో విద్యాభివృద్ధికి చేపట్టిన చ ర్యలను వివరించారు.వచ్చే విద్యా సంవత్సరంలో బడి ఈడు కలిగిన ప్రతి ఒక్కరినీ బడి లో చేర్చాలని కోరారు.

పాఠశాల ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యా ర్థులు కష్టం తో కాకుండా ఇష్టం తో చదువుకోవాలని సూచించారు. త మ తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టే విధంగా చదువులో రా ణించాలని కోరారు. వేసవి సెల వు ల్లో విద్యార్థులు ఆరోగ్య రక్షణకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూ చించారు. పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం 5 వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు స్వచ్ఛందం గా ముందుకు వచ్చి తాము చదు వుకున్న పాఠశాలకు గుర్తుగా గోడ గడియారం ను బహూకరించారు . కాగా 5వ తరగతి విద్యార్థులకు 4 వ తరగతి విద్యార్థులు జ్ఞాపికలను అందజేసి ఘనంగా వీడ్కోలు పలి కారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం ఎస్.కల్పన , ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్, విజయ లక్ష్మీ, విద్యా వాలింటర్ వెంక ట్రాములు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.