–సివరేజ్ ప్లాంట్ ను ఉపయోగం లోకి తేవాలి
— సిపిఎం డిమాండ్
CPM Demand : ప్రజాదీవెన నల్గొండ : నల్లగొండ పట్టణంలో అస్తవ్యస్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం జరుగుతుందని ఇల్లు ఉన్న చోట కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధి కోసం ఖాళీ ప్లాట్ల దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎక్కువగా సాగుతున్నాయని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి. సలీం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. గత 20 సంవత్సరాల క్రితం మొదటి విడత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో పైప్ లైన్లు వేసి శివరేజ్ ప్లాంట్ నిర్మాణం చేయకుండా వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్యోగం చేయడమే కాకుండా మ్యానువల్స్ పొంగి మురికి నీరు బయటకి వచ్చి దుర్వాసనతో ప్రజలు అనారోగ్యాలకు గురైతున్నారని అన్నారు. ఇప్పుడు రెండో విడత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కవర్ గాని ప్రాంతాలు లలో యుజిడి పనులు చేస్తామని నిధులు మంజూరు చేసి ప్రాధాన్యత క్రమంలో ప్రజలు నివాసం ఉన్న పానగల్లు, పెద్ద బండ, విలీన గ్రామపంచాయతీలో యు జి డి పనులు చేయకుండా ఖాళీ ప్లాట్ల దగ్గర యూజీడి నిర్మాణ పనులు చేయడం రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే అని అన్నారు.
యు జి డి పనులు చేసిన దగ్గర పెద్ద పెద్ద గుంతలు పడడం వలన మాన్యువల్స్ రోడ్డు పైకి ఉండడం వలన ప్రమాదాలు జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మాన్యువల్స్ క్యూరింగ్ సరిగా లేకపోవడంతో కూలిపోతున్నాయని వెంటనే వాటిని సరిచేస్తూ యూజీడి నిర్మాణం జరిగిన ప్రతి చోట సిసి రోడ్ల నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. సివరేజ్ ప్లాంట్ పూర్తిచేసి యూజీడి పైప్ కనెక్షన్ ఇచ్చి ఉపయోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మ్యానువల్స్ పొంగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వర్షాకాలం ప్రారంభమైనందున రోడ్ల వెంట చెత్తాచెదారం, మురికిగుంటలు లేకుండా చూడాలని కోరారు. పట్టణంలో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ లలో డాక్టర్లు మందులు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.