Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hareesh Rao: వారికి పదవులు..వీరికి పంగనామాలు

–అప్పుడేమో హామీలు ఇప్పుడేమో నిరుద్యోగుల‌పై లాఠీలు
–గాంధీలో దీక్ష చేస్తున్న విద్యార్థి నా యకుడు మోతీలాల్‌కు పరామర్శ
–నిరుద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌ రించేయాల్సిందే, గ్రూప్ మెయిన్ నిష్ప‌త్తి పెంచాల్సిందే
–అనంతరం మీడియాతో మాట్లా డుతూ మాజీ మంత్రి హరీష్ రావు

Hareesh Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్‌ ప్రభుత్వంలో బల్మూరి వెంకట్‌, తీ న్మార్‌ మల్లన్నకు ఉద్యోగాలు వచ్చా యని, ధర్నాలు చేస్తున్న గ్రూప్స్‌ అభ్యర్థులకు మాత్రం రాలేదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (hareesh Rao)ఎద్దేవా చేశారు. హైద‌రా బాద్ గాంధీ ఆసుపత్రిలో (Gandhi hospital)దీక్ష చేస్తు న్న విద్యార్థి నాయకుడు మోతీలాల్‌ ను ఆదివారం ఆయన పరామర్శిం చారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగుల సమ స్యలు పరిష్కరించాలంటూ మోతీ లాల్‌ నాయక్‌ (Moti Lal nayak)నిరాహార దీక్ష చేస్తు న్నారని తెలిపారు. దీక్ష విరమించా లని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ప్రజాపాలనలో విద్యార్థులు, నిరు ద్యోగులను ప్రశ్నిస్తే కేసులు పెడుతు న్నారని విమర్శించారు.ఎన్నికల ముందు నిరుద్యోగులపై కపట ప్రేమ చూపించిన కాంగ్రెస్‌ పార్టీ (Congress party)గద్దెనెక్కిన తర్వాత వారి గుండెల మీద తన్ను తున్నదని విమర్శించారు. రాహుల్‌ గాంధీని (Rahul Gandhi) అశోక్‌నగర్‌కు పిలిపించి మరీ హామీ ఇప్పించారని తెలిపారు. రెండు లక్షల ఉద్యోగాలు నింపుతా మని రాహుల్‌ మాట ఇచ్చారని గుర్తుచేశారు. జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని ప్రశ్నించారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు ఆంధ్రప్రదేశ్‌లో 1:100 పిలుస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యంకాదని ప్రశ్నించా రు. మోతీలాల్ నాయక్ గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కాంగ్రెస్ సర్కారుకి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ప్రభు త్వం మొద్దునిద్ర పోతున్నదని విమ ర్శించారు. ఇది తన ఒక్కడి కాదని, నిరుద్యోగులందరి సమస్య అంటు న్నాడని చెప్పారు.గ్రూప్‌-2, 3 ఉద్యో గాల సంఖ్య పెంచాలని డిమాండ్‌ చేశారు. జీవో 46 రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ ఎందుకు వేయడం లేదని, ప్రైమరీ స్కూల్స్‌లో టీచర్‌ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాం డ్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాలు (assembly meeting)ప్రారంభం కాగానే నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తామన్నారు. అసెంబ్లీని స్తంభింపచేస్తామని చెప్పారు. మోతీలాల్‌కు ఏమైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహిం చాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం రేవంత్‌ రెడ్డి వచ్చి చర్చలు జరపాలని డిమాండ్ (demand)చేశారు.