Harikishan Vedalankar : దేశ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను నింపిన విప్లవ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్హ.రికిషన్ వేదాలంకార్,
Harikishan Vedalankar : ప్రజా దీవెన, నల్గొండ:
స్వాతంత్ర్యం భిక్ష కాదు.. దాన్ని పోరాటం ద్వారానే సాధించుకుందామనే నినాదంతో స్వాతంత్ర్య పోరాటం చేసిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ ఆని ఆర్యప్రతినిధి సభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధానకార్యదర్శి హరికిషన్ వేదాలంకార్, జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్ అన్నారు.. జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలతో పాటు పరాక్రమ దివస్, జనగణమన ఉత్సవ సమితి వార్షికోత్సవ వేడుకలు నల్లగొండ జిల్లాలో ఘనంగా నిర్వహించారు….. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ రూపొందించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని పిలుపు నిచ్చి దేశ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను నింపిన విప్లవ నాయకుని గురించి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలనీ అన్నారు.. జపాన్, జర్మనీ దేశాల సహకారంతో బ్రిటీష్ వారిపై ప్రత్యక్ష పోరాటం జరిపి 1943లోనే జాతీయ జెండా ఎగుర వేసి దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారని అన్నారు. నల్లగొండ డిఎస్పీ శివరామిరెడ్డి మాట్లాడుతూ..
స్వాతంత్ర్య పోరాటంలో 11సార్లు జైలుకు వెళ్లి వచ్చి ఆజాద్ హిందూ ఫౌజ్ పేరుతో ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసి స్వాతంత్ర్యం పోరాటం చేశారనీ గుర్తు చేశారు. లక్షలాది మంది కల అయిన ఐసీఎస్ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి ఎందరికో ఆదర్శంగా నిలిచారని అన్నారు. దేశ నాయకుల గురించి తెలుసుకోవడమే కాకుండా వారి ఆలోచనా విధానాలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని రిటైర్డు ఐఏఎస్ అధికారి, పాండిచ్చేరి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి చొల్లేటి ప్రభాకర్ అన్నారు. అనంతరం నేతాజీ జీవిత చరిత్ర పై జరిగిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు… జనగణమన నిత్య జాతీయ గీతాలాపన కేంద్రాల ఇన్చార్జి లను అతిథులచే సన్మానించారు
. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బర్రి శ్రీనివాస్ రెడ్డి , వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్, మాజీ చైర్మన్ బోయపల్లి కృష్ణారెడ్డి, ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, జనగణమన ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొలనుపాక రవికుమార్, సహాయ అధ్యక్షులు దోసపాటి శ్రీనివాస్, కోశాధికారి పోలోజు బాగేంద్రాచారి, సభ్యులు పోలా జనార్దన్, శ్యామ్ సుందర్ రెడ్డి, ఆర్కే ప్రదీప్, మందాలపు శ్రీనివాస్, గణేష్, జానారెడ్డి, పానగంటి సోను, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…