–పాప పరిహార పూజలు చేసిన హరీష్ రావ్
–యాదాద్రి లో మాజీ మంత్రి హరీష్ రావ్ ప్రత్యేక పూజలు
Harish Rao: ప్రజా దీవెన, యాదాద్రి : యాదాద్రి నర్సన్న సాక్షిగా ఒట్టు వేసి తప్పిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)శాపం తెలంగాణ ప్రజలకు తగలకుండా కాపాడాలని కోరుకున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపే ట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు (Harish Rao) తెలిపారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని యాదాద్రి శ్రీ లక్ష్మి నారసింహా స్వా మిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, కార్యక ర్తలు ఘన స్వాగతం పలికారు. యా దాద్రి నర్సన్న కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆగస్టు 15 లోగా రైతులందరికీ రుణమాఫీ Loan waiver for all farmers) చేస్తానని రేవంత్ రెడ్డి యాదాద్రి శ్రీలక్ష్మి నర్సిం హా స్వామి (Yadadri Srilakshmi Narsim Ha Swamy)మీద ఒట్టేసి రైతులను దగా చేసారని అన్నారు.
రాష్ట్ర ప్రజలకు ఎలాంటి కీడు జరగ కూడదని పాప పరిహార పూజలు ని ర్వహించినట్లు చెప్పారు. వీరి వెంట నాయకులు దేశపతి శ్రీనివాస్, బూ డిద బిక్షమయ్య గౌడ్, బాలరాజు యాదవ్, క్యామా మల్లేష్, కర్రె వెంక టయ్య, శ్రీకర్ రెడ్డి, రవీందర్ గౌడ్, తదితరులు ఉన్నారు. అనంతరం వేద ఆశీర్వచన మoడపంలో వేద పండితులు హరీష్ రావు, కుత్బు ల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరి వెంకటేశ్వర్లు, ఉప్ప ల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ లకు వేద ఆశీర్వచనం నిర్వహించి వారికి లడ్డూ ప్రసాదం అందించారు.