Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao: నా వెనుకున్నోనివి.. మర్చిపోయావా

–నాకు మంత్రి పదవి వచ్చినపుడు ఊరేగింపులో ఉన్నావ్‌
–నేను రాజీనామా చేసినప్పుడూ టీఆర్‌ఎస్‌లోనే ఉన్నావ్‌
–సీఎం రేవంత్‌ రెడ్డి వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన హరీశ్‌రావు

Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్‌: నాకు మంత్రి పదవి వచ్చినపుడు ఊరే గింపులో, తెలంగాణకు జరుగు తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నేను మంత్రి పదవికి రాజీనామా చేసిన ప్పుడు కూడా టీఆర్‌ఎస్‌లోనే ఉన్నావ్‌, నువ్వు నా వెనుకున్నోని వి … నిక్కినిక్కి చూశావ్‌’’ అని రేవంత్‌ను (Revanth) విమర్శిస్తూ అందుకు సంబంధించిన ఓ వీడియోను మాజీ మంత్రి హరీశ్‌ రావు (Harish Rao) ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అప్పుడు ఇదంతా ఆయన కళ్లముందు జరిగిందని, ఇవేమీ తెలియనట్లు రేవంత్‌రెడ్డి చిల్లర వ్యా ఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం హోదాలోనూ ఆయన హుం దాగా ప్రవర్తించడం లేదని, చిల్లరగా మాట్లాడే చీప్‌ మినిస్టర్‌గా వ్యవహ రిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగా ణ ఉద్యమంలో పదవులను త్యజిం చిన చరిత్ర తమదని తెలిపారు. తనకు మంత్రి పదవి ఎవరి భిక్షవల్ల నో రాలేదని, సోనియాగాంధీ (Sonia Gandhi) సూచ న మేరకు అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభు త్వంలో చేరాం తప్ప, పదవుల కోసం కాదని స్పష్టం చేశారు.

పద వులు, విలువల గురించి మాట్లాడే హక్కు రేవంత్‌రెడ్డికి (Revanth Reddy) ఎక్కడిదని.. పదవుల కోసం పెదవులు మూసు కున్నది, పూటకో పార్టీ మారిన రాజ కీయ చరిత్ర ఆయనదని హరీశ్‌రా వు విమర్శించారు. కాగా, కొలువుల ను క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్షా అభియాన్‌ కాంట్రాక్టు ఉద్యోగులు (Contract employees) రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నా సీఎంకు చీమ కుట్టినట్టైనా లేదని హరీశ్‌ రావు విమర్శించారు. చాయ్‌ తాగేలోపు జీవో ఇచ్చి మీ ముఖాల్లో సంతోషం చూడొచ్చు అంటూ ఎన్ని కల సమయంలో రేవంత్‌ హామీ ఇచ్చిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలైనా రేవంత్‌రెడ్డికి చాయ్‌ తాగే సమయం కూడా దొరకడం లేదా?’’ అని ప్రశ్నించారు. సమగ్ర శిక్ష ఉద్యో గుల డిమాండ్లను పరిష్కరించాలని సీతక్క చేసిన డిమాండ్‌ కూడా ఆ వీడియోలో ఉండడం గమనార్హం.