–కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: సింగరే ణి కార్మికుల బోనస్ ను కాంగ్రెస్ ప్ర భుత్వం బోగస్ గా చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)ధ్వజమెత్తారు. కార్మికులకు ఇచ్చే లాభాల్లో కోత విధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం రూ. 4701 కోట్లలో 33% ను కార్మికులకు బోన స్ గా ప్రకటించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)మాట లు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మి కుల విషయంలో మరోసారి రుజు వైందని వ్యాఖ్యానించారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారని గుర్తు చేశారు. సంస్థ గడించిన లాభాల ఆధారంగా కార్మి కులకు ఇచ్చే బోనస్ ను కూడా బోగస్ చేసారన్నారు. లాభాల వాటలో 50% కోత విధిస్తూ కార్మి కులకు చేసిన అన్యాయాన్ని బిఆ ర్ఎస్ పార్టీ (brs party) పక్షాన తీవ్రంగా ఖండి స్తున్నామని అన్నారు. ఎంతో శ్రమించి సంస్థకు డబుల్ ప్రాఫిట్ చూపించినందుకు డబుల్ వాటా వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వo కార్మి కుల ఆశలను అడియాశలు చూ పించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
2022-23 గత ఆర్థిక సంవత్సరం (Financial year)లో వచ్చిన లాభాలు రూ.2222 కోట్లు అయితే దీనిలో 32 శాతం రాగా దాదాపు రూ.710 కోట్ల రూ పాయలు కార్మికులకు అందించామ న్నారు.కానీ ఈ ఏడాది 2023-24 కు వచ్చిన లాభాలు రూ.4701 కో ట్ల రూపాయలు కాగా ప్రభుత్వం చెప్పిన విధంగా 33 శాతం లాభా లు పంచితే మొత్తంగా దాదాపు రూ.1550 కోట్ల రూపాయలు కార్మి కులకు రావాల్సి ఉందన్నారు. కానీ కార్మికులకు(to workers ప్రకటించింది కేవ లం రూ.796 కోట్లు. అంటే ఇది 16.9 శాతం. కార్మికులకు హక్కుగా రావాల్సిన మిగతా వాటా 754 కోట్లు ఏమైనట్టు అని ప్రశ్నించారు. లాభాలేమో రూ.4,701 కోట్లు చూపించి, కేవలం రూ.2,412 కోట్లలో 33 శాతం బోనస్‌ను ప్రక టించడం ఏమిటి, మిగతా రూ.2, 289 కోట్లకు బోనస్‌ను ఎగ్గొట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఆల్‌టైం రికా ర్డు ఉత్పత్తిని సాధించినా గతం కంటే ఒక్కో కార్మికుడికి అదనంగా ఇచ్చేది రూ.20 వేలేనా, కార్మికులు చేసిన కష్టానికి, ఫలితం ఇవ్వకపో వడం దారుణమని, కెసిఆర్ మార్గ నిర్దేశనంలో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ లాభా ల్లో దూసుకుపోయింది.
నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను (Singareni Institute) లాభాల బటాలో పట్టించారు కార్మికుల కష్టా నికి గుర్తింపుగా ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను పెంచుతూ వచ్చా రన్నారు. సమైక్య రాష్ట్రంలో 200 8-09 నుంచి 2010-11 వరకు సిం గరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా కేవలం 16 శాతమేనని, స్వ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం వెం ట నడిచిన సింగరేణి కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఎంతో ఉదారతతో వ్యవ హరించారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరం (2014 -15)లోనే సింగరేణి లాభాల నుంచి కార్మికులకు 21 శాతం వాటాను ప్ర కటించారని చెప్పారు.2022-23లో కార్మికులకు సంస్థ లాభాల్లో ఏకంగా 32 శాతం వాటాను ప్రకటించి కార్మి కుల కష్టానికి గుర్తింపు, గౌరవం ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభు త్వం మాత్రం అందరికీ వెలుగు అందించే కార్మికుల జీవితాల్లో చీకటి నింపే ప్రయత్నం చేస్తుందని,సమైక్య రాష్ట్రంలో కార్మికులకు జరిగిన అన్యాయం కంటే తీవ్ర అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని ఆరోపించారు.
ఘనంగా చెప్పుకున్న కాంట్రాక్ట్ కార్మికులకు (Contract workers వాటా విషయంలోనూ ఇదే పరిస్థితి. ఉద్యోగుల సంఖ్యను కుదించి 5వేల బోనస్ కొందరికే పరి మితం చేయడం మరో మోసమని విమర్శించారు. బి ఆర్ ఎస్ ప్రభు త్వం ప్రతి ఏటా కార్మికులకు చెల్లిం చినట్లుగానే లాభాల్లో వాటా చెల్లిం చాలని, మొత్తం 4701 కోట్లలో 33% బోనస్ గా ప్రకటించాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డి మాండ్ చేస్తున్నామన్నారు. తెలం గాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో ఎంతో కీలకంగా ఉన్న సింగరేణి కార్మికులకు అన్యా యం జరిగితే బి ఆర్ ఎస్ పార్టీ చూ స్తూ ఊరుకోదు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.