–ఆశా వర్కర్ల వేతనాలు ఇవ్వరా
–పింఛన్ కోసం అవ్వతాతలు పడి గాపులు
–సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పై మా జీ మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం
Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో ఉద్యోగ నియామకాలు, ఉపాధి అవకాశాలపై సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy)కాంగ్రెస్ ప్రభుత్వo పై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నల వర్షం కురిపించారు. నిరుద్యోగుల డిమాం డ్లు నెరవేర్చకపోతే త్వరలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.తెలంగాణ భవన్‌లో సోమవారంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గ్రూప్స్ ఉద్యోగాలు పెంచాలని అడి గిందని, మరి ఇప్పుడు ఎందుకు పోస్టులు పెంచడం లేదని నిలదీశా రు. ఉద్యోగులకు ప్రతి నెలా 1న జీతాలు ఇస్తే, ఆశా వర్కర్లు ఎందు కు వైద్యవిధాన పరిషత్‌కు వస్తారని ప్రశ్నించారు. ఎన్‌హెచ్‌ఎం కింద 17 వేల మంది పనిచేస్తున్నారని, వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాం డ్ చేశారు. ఐదు నెలల నుంచి సఫా యి కార్మికులకు ఎందుకు వేతనాలు ఇవ్వలేకపోతున్నారని విమర్శించా రు. వెంటనే గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయాలన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కులపై కేసీఆర్ బొమ్మ (kcr) ఉందని ఇవ్వట్లేదని, 1.5 లక్షల మంది చెక్కుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. అంగన్ వాడీ టీచర్లు రోడ్లు ఎక్కుతున్నా రని, 60వేల మంది జీతాల కోసం వేచిచూస్తున్నారన్నారు. తమ హ యాంలో వారికి జీతాలు ఆపలే దని, ఏ సందర్భంలో నీట్ పరీక్షపై నీలి నీడలు కమ్ముకున్నాయన్నారు హరీశ్ రావు. కేంద్రంలో బీజేపీ (bjp)తీరు తో విద్యా విధానం కుంటు పడు తుందని, 24 లక్షల మంది వైద్య విద్యార్థులు ఆగమయ్యే పరిస్థితి ఉందని చెప్పారు. పేపర్ లీకేజీ, గ్రేస్ మార్కులు కలపటం వల్ల ఇబ్బం దులు ఎదురవుతున్నాయన్నారు. 67మందికి మొదటి ర్యాంక్ వచ్చిం దని, పరీక్ష రాసిన ఆరుగురు విద్యా ర్థులకు 720 మార్కులు వచ్చాయ ని వివరించారు. కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి దీనిపై అస్సలు మా ట్లాడటం లేదన్నారు.1563 మంది విద్యార్థులకు ఏ విధంగా గ్రేస్ మా ర్కులు కలిపారని ప్రశ్నిస్తూ, వారి పేర్లు, నంబర్లు ఎందుకు తెలపడం లేదని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ జరిగిందనడానికి ఇంతకన్నా నిద ర్శనం ఏం కావాలన్నారు. ఎన్నికల ఫలితాల కంటే ముందే ఈ ఫలి తాలు రావటం అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. పేపర్ లీకేజీ పైన ఈడీ, సీబీఐ విచారణ ఎందు కు జరపటం లేదని ప్రశ్నించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ (group 1)లో పాస్ అయిన విద్యార్థులకు 1:50 కాకుండా 1:100చొప్పున మెయిన్స్ ఎగ్జా మ్‌కు అవకాశమివ్వాలని బీఆర్ ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. తద్వారా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగు తుందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1:100 విధానం అమలు చేస్తామని విద్యా ర్థులకు హామీ ఇచ్చారని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. ఉపముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యుతను మోసం చేసిందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతి పక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని అభ్యర్థులు బీఆర్‌ఎస్ (brs) కార్యాల యానికి వచ్చి వినతిపత్రం ఇచ్చా రని చెప్పారు. గ్రూప్స్ పరీక్షలకు మధ్య వ్యవధి ఉండాలని అభ్య ర్థులు కోరుతున్నారని తెలిపారు.
పింఛన్‌లు ఎందుకు ఇవ్వడం లేదు… ప్రభుత్వం వచ్చి ఆరు నెల లయిందని, ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని విమ ర్శించారు. పింఛన్ ఎప్పుడిస్తారని అవ్వతాతలు అడుగుతున్నారని చెప్పారు. కేసీఆర్ (kcr) అధికారంలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా పెన్షన్ వచ్చేదని అంటున్నారని తెలిపారు. రెండు నెలల నుంచి ఆసరా పింఛన్ రావడం లేదని వెల్లడించారు. అవ్వతాతలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న పింఛన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రజాపాలన పేరుతో తీసుకున్న ఆరు గ్యారంటీల దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజాపాలన ఆచరణలో ఏమైందన్నారు. పేదల పట్ల ఇంత వివక్ష ఎందుకని నిలదీశారు. ఏపీ సీఎం మొదటి సంతకంతో పింఛన్ రూ.4 వేలకు పెంచారని, మీరు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలన్నారు. పక్కన ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) ఇచ్చినప్పుడు మీరెందుకు ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వికలాంగులకు రూ.6 వేల పింఛన్ వెంటనే ఇవ్వాలన్నారు. చేనేత, గీత కార్మికులకు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ పేషెంట్లకు బీఆర్‌ఎస్ హయాంలో పెద్ద ఎత్తున పింఛన్ ఇచ్చామని చెప్పారు. ఇంటికి రెండు పింఛన్లు ఇస్తామన్నారని గుర్తుచేశారు.ఉద్యోగులకు ప్రతి నెలా 1న జీతాలు ఇస్తే ఆశా వర్కర్లు ఎందుకు వైద్యవిధాన పరిషత్‌కు వస్తారని ప్రశ్నించారు. ఎన్‌హెచ్‌ఎం కింద 17 వేల మంది పనిచేస్తున్నారని, వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదు నెలల నుంచి సఫాయి కార్మికులకు ఎందుకు వేతనాలు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. వెంటనే గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయాలన్నారు. సీఎంఆర్‌ఎఫ్ చెక్కులపై కేసీఆర్ బొమ్మ ఉందని ఇవ్వట్లేదని, 1.5 లక్షల మంది చెక్కుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. అంగన్‌వాడీ టీచర్లు రోడ్లు ఎక్కుతున్నారని, 60వేల మంది జీతాల కోసం వేచిచూస్తున్నారన్నారు. తమ హయాంలో వారికి జీతాలు ఆపలేదన్నారు.
నీట్ పేపర్ లీకేజ్.. ప్రధాని నోరు మెదపరేం …
అలాగే, నీట్ పరీక్షపై నీలి నీడలు కమ్ముకున్నాయన్నారు హరీశ్ రావు(Harish Rao:). కేంద్రంలో బీజేపీ (bjp) తీరుతో విద్యా విధానం కుంటు పడుతుందని, 24 లక్షల మంది వైద్య విద్యార్థులు ఆగమయ్యే పరిస్థితి ఉందని చెప్పారు. పేపర్ లీకేజీ, గ్రేస్ మార్కులు కలపటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 67మందికి మొదటి ర్యాంక్ వచ్చిందని, పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులు వచ్చాయని వివరించారు.. కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి దీనిపై అస్సలు మాట్లాడటం లేదన్నారు.. 1563 మంది విద్యార్థులకు ఏ విధంగా గ్రేస్ మార్కులు కలిపారని ప్రశ్నిస్తూ, వారి పేర్లు, నంబర్లు ఎందుకు తెలపడం లేదని ప్రశ్నించారు.. పేపర్ లీకేజీ జరిగిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నారు.. ఎన్నికల ఫలితాల కంటే ముందే ఈ ఫలితాలు రావటం అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. పేపర్ లీకేజీపైన ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు జరపటం లేదని ప్రశ్నించారు.