Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Civil Service: సివిల్స్ విజేతలకు మాజీ మంత్రి హరీష్ రావు అభినందనలు

ఆలిండియా సివిల్ సర్వీస్‌కు ఎంపికైన రాష్ట్ర విద్యార్థులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును కలిసి అభినందనలు తెలిపారు.

ప్రజా దీవెన, హైదరాబాద్: ఆలిండియా సివిల్ సర్వీస్‌కు (Civil Service)ఎంపికైన రాష్ట్ర విద్యార్థులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును (Harish Rao)కలిసి అభినందనలు తెలిపారు. తమను ప్రోత్సహించినందుకు విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవ చేసేందుకు దక్కిన అద్భుత అవకాశాన్ని సద్వి నియోగం చేసుకుని, పేద ప్రజలకు అండగా నిలవాలని హరీష్ రావు వారిని కోరారు.

వృత్తిలో నిబద్ధ తతో పనిచేస్తూ, మరింత మంది యువతీయువకులకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. మంచి పనీతీరుతో, సామాజిక సేవతో మీ తల్లిదండ్రులకు, తెలంగాణకు పేరు తేవాలని ఆకాంక్షించారు. భవిష్య త్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరారు.

తెలుగు రాష్ట్రాల యువతీయువకులకు సివిల్స్ పరీక్షల్లో అత్యుత్తమ శిక్షణ ఇస్తూ ఐఏఎస్‌లను(IAS) తయారు చేస్తు న్న సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత(Balalatha) గారిని హరీష్ రావు ఈ సందర్భంగా సన్మానించారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రతియేటా సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికై ఇంటర్వ్యూకు వెళ్లే విద్యార్థులకు గైడెన్స్ ఇస్తుం టారు. ప్రభుత్వ పాలన, రాజకీ యాలు, సామాజిక అబివృద్ధి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ వారి విజయానికి దోహదపడు తుంటారు.

Harish Rao congratulated civil winners