–మా గొప్పలు వాళ్ళ చప్పట్లుగా చెప్పుకొంటున్నారు
–సీతారామ పూర్తి చేశామని,30వేల ఉద్యోగాలిచ్చామనడం సిగ్గుచేటు
–రూ. 75 కోట్లతో లక్షన్నర ఎకరాల కు నీళ్లన్న భట్టి నోబుల్ కు అర్హుడు
— మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు
Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్ : బీఆరెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగ నోటి ఫికేషన్లకు నిమయాక పత్రాలిచ్చి బీఆరెస్ కట్టిన సీతారామ ప్రాజెక్టుకు రిబ్బన్ కటింగ్ (Ribbon cutting for Sitarama project)చేస్తూ కాంగ్రెస్ పాల కులు పరాన్న జీవులుగా మారి పో యారని మాజీ మంత్రి, టీ.హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 9 నెల ల్లోనే 30 వేల ఉద్యోగాలకు నియా మక పత్రాలు ఇచ్చి హడావుడి చేసి నట్టు సీతా రామ ప్రాజెక్టు విష యంలో చేస్తున్నారని, సీతారామ ప్రాజెక్ట్ క్రెడిట్ తీసుకునేందుకు మంత్రులు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతా రామ ప్రాజెక్టుకు అనుమతులు తా మే తీసుకువచ్చినట్టు అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించా రు. ఈ నెల 15 న సీఎం రేవంత్ రెడ్డితో సీతారామ ప్రాజెక్టును ప్రా రంభించడం ద్వారా క్రెడిట్ తీసుకు నేందుకు కాంగ్రెస్ ఖమ్మం జిల్లా మం త్రులు మరో ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ (kcr)సీతారామ ప్రాజెక్టును తనకూ ఇష్టమైన పనిగా మొదలు పెట్టారని. ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడ
సీతారామ ఘనత కేసీఆర్ (kr)ది కాదని తుమ్మల చెప్పగలరా… నామకరణం ప్రభుత్వం మారడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం వచ్చిందని, దీన్ని అవకాశంగా తీసుకుని ప్రాజెక్టు తామే కట్టామని కాంగ్రెస్ మంత్రులు కటింగ్ ఇచ్చుకుంటున్నారని వ్యం గ్యాస్త్రాలు సంధించారు. ఈ ఏడు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తయిందంటు న్న కాంగ్రెస్ నేతలను (Congress leaders)చూసి జనం నవ్వు కుంటున్నారన్నారు. సీతారా మ ప్రాజెక్టులో మూడు పంపులు, సబ్ స్టేషన్ల నిర్మాణం బీఆరెస్ హ యాంలోనే పూర్తయ్యాయని తెలి పారు. 75 కోట్ల రూపాయలతో లక్షన్నర ఎకరాల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెబుతున్న డిప్యూటీ సీఎం భట్టికి నోబెల్ ప్రైజ్ (Nobel Prize)ఇవ్వా లన్నారు. నాగార్జున సాగర్, ఆల్మట్టి వైపు ఖమ్మం జిల్లా ప్రజలు చూడ కుండా సీతారామ ప్రాజెక్టు ప్రతి ఇంచి భూమిని సస్యశ్యామలం చేస్తుందన్నారు. ఖమ్మంను రెండు పంటలు పండే జిల్లాగా మార్చాలని సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ సంక ల్పించారని చెప్పుకొచ్చారు. ఇంది రా రాజీవ్ సాగ ర్ల ద్వారా 3 వేల క్యూసెక్కుల నీళ్లను ప్రతిపాదిస్తే కేసీ ఆర్ సీతారామ ప్రాజెక్టు ద్వారా తొమ్మిది వేల క్యూసె క్కుల నీళ్లు తీసుకునేలా ప్లాన్ చేశారన్నారు. సీతారామ బీఆర్ఎస్ హయంలోనే 90 శాతం పూర్తియిoదని, మెయిన్ కెనాల్ లో ఎనిమిది ప్యాకేజీలు ఉంటె ఐదు ప్యాకేజీలు బీఆరెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని వివరించారు.
సీతారామ ప్రాజెక్టును (Sitarama project) అడ్డంకులు సృష్టించేం దుకు కాంగ్రెస్ నేతలు కోర్టులకు వెళ్లారని, ఈ విషయాన్ని అపుడు బీఆరెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావునే స్వయంగా చెప్పారన్నారు. సీతా రామ ప్రాజెక్టును ఘనత కేసీఆర్ కాదని తుమ్మల గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా అని హరీశ్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ కలల ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు అని, ఎన్నో ప్రభు త్వాలు వచ్చినా ఖమ్మంకు గోదావరి జలాలు ఇవ్వా లనే ప్రయత్నం చేయలేదన్నారు. సీతారామ ప్రాజెక్టుకు హైద్రాలజీ, అంతర్రాష్ట్ర అనుమతులు బీఆరెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయ ని, జూలై 2023 లోనే 67 టీఎంసీ లకు కేంద్ర జలసంఘం అనుమతి ఇచ్చిందని తెలిపారు. 2005 నుంచి తొమ్మిదేళ్ల పాటు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా రాజీవ్ సాగర్ల లకు ఒక్క అనుమతి తీసుకురాలే దన్నారు.
డిప్యూటీ స్పీకర్ గా ఉన్న పుడు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఖమ్మం జిల్లా ప్రాజెక్టులకు సంబంధించి ఏ ప్రయ త్నం చేయలేదన్నారు. ఖమ్మం జిల్లా లో ప్రతి ఎకరాకు రెండు పంటలకు నీళ్లు అందేలా సీతారామ ప్రాజెక్టుకు కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. జూన్ లో ఖమ్మం జిల్లాలో నాట్లు పడేలా సీతారామ ప్రాజెక్టును రూ పొందించామని తెలిపారు. 3వేల చెరువులను నింపేలా సీతారామ ప్రాజెక్టును డిజైన్ చేశామని, పాలే రుకు సీతారామ ప్రాజెక్టును కలప డం వల్ల ఖమ్మం పట్టణానికి తాగు నీటి సమస్య లేకుండా పోతోంద న్నారు. కేసీఆర్ స్వయంగా ఎన్నోసా ర్లు ఢిల్లీ వెళ్లి సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు సాధించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ప్రాజెక్టు కు అటవీ శాఖ అనుమతులు సాధించలేదని, సాగర్ ఆయకట్టు 3.4 లక్షల ఎకరాలకు కూడా సీతా రామ ప్రాజెక్టు ద్వారా నీరందించేలా కేసీఆర్ పూనుకున్నారన్నారు. చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే పాలేరు బ్యాక్వాట ర్స్ ద్వారా నల్లగొండ జిల్లాకు సీతా రామ ప్రాజెక్టుతో గోదావరి జలాల ను అందించేటట్టు జాగ్రత్తలు తీసు కున్నామని చెప్పారు. ఎంతో ముం దుచూపుతో కేసీఆర్ ఈ సీతా రామ ప్రాజెక్టును ప్రతిపాదించారన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభం సంద ర్భంగా బీఆరెస్ ఆధ్వర్యంలో సంబ రాలు నిర్వహిస్తామన్నారు.
ప్రజారోగ్యం పట్టదా… కాంగ్రెస్ ప్రభుత్వానికి లిక్కర్ టార్గెట్ల (Liquor targets)మీద దృష్టి పెట్టడం తప్ప ప్రజారోగ్యం పట్ట దా అని హరీశ్ రావు ప్రశ్నిం చారు. విషజ్వరాల బారినపడి పిల్లలు చనిపోతున్నారని, పబ్లిసిటీ స్టంట్లు తప్ప పరిపాలన మీద దృష్టి పెట్టడం లేదన్నారు. బీఆరెస్ ప్రభు త్వ హయాంలో చేసిన పనులు ప్రా రంభించడం తప్ప కాంగ్రెస్ ప్రభు త్వంలో చేసిందేమి లేదన్నారు. సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలను అప్పులు పాలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. దమ్ముంటే మా నియోజకవర్గానికి కాంగ్రెస్ మంత్రులు వస్తే పంచాయ తీల్లో నెలకొన్న దుస్థితిని నిరూపిస్తా నని సవాల్ చేశారు.