Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao : హరీష్ ఘాటువ్యాఖ్య, సీఎం రేవంత్ మాటలకు చేతలకు పొంతనలేదు

Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట లకు చేతలకు పొంతన లేదని పది కి వందసార్లు నిరూపితమైoదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే త న్నీరు హరీష్ రావు మండిపడ్డారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రె స్ క్లబ్ కు వెళ్లి సవాల్ విసిరితే రే వంత్ రెడ్డికి మొహం చాటేసిండని
క్లబ్లులకు పబ్బులకు రాను అని బి ల్డప్ ఇచ్చిండన్నారు. ఈరోజు రేవం త్ రెడ్డి సెవన్ స్టార్ హోటల్ లీలా ప్యాలెస్ లో ప్రెస్ మీట్ పెట్టిండని, ఢిల్లీలో అధికారిక నివాసం, తెలం గాణ భవన్ ఉండగా అక్కడ ప్రెస్ మీట పెట్టకుండా స్టార్ హోటల్లో ఎ లా పెట్టాడని ప్రశ్నించారు. తెలంగా ణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లా డారు.

బనకచర్లపై బాబు మీటింగ్ పెడితే ఢిల్లీ మీటింగ్ వెళ్ళబోమని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి అర్ధరాత్రి పూట పరుగు పరుగున ఎందుకు పోయా డని, బాయ్ కట్ చేస్తమని లీకులు ఇచ్చాడు ఎందుకు డిల్లీకి వెళ్లావు. అర్ధరాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించా రు. ఎందుకు ఢిల్లీకి పోయావో ప్రజ లకు సమాధానం చెప్పాలని డి మాండ్ చేశారు. గతంలో నీతి అ యోగ్ మీటింగ్ కు వెళ్లనని అని అ సెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి, ఆ త ర్వాత నీతి అయోగ్ మీటింగ్ లో అ టెండ్ అయ్యారని గుర్తు చేశారు.

ఊసరవెల్లి కూడా రేవంత్ ను చూసి సిగ్గుపడుతుందని,బనకచర్ల అంశం నేటి ఎజెండాలో లేనప్పుడు ఆపమ నే ముచ్చటే రాదు అని రేవంత్ రెడ్డి బుకాయించిండు అంటూ విమర్శిం చారు.

అజెండాలో మొట్ట మొదటి అంశం గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అని,
కానీ ప్రెస్ మీట్ లో అబద్దం చెప్పి oడని, ఏపీ మంత్రి నిమ్మల రామా నాయుడు బనకచర్ల పై చర్చించాం అంటడు, పరిష్కారం కోసం కమిటీ వేసాం అంటడు, రేవంత్ రెడ్డి ఏమో బనకచర్ల చర్చ రాలేదు అంటడు.
ఎంత నిస్సిగ్గుగా మాట్లాడాడు, ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడవచ్చు నా అని ప్రశ్నించారు.

ఎవర్ని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి… రాష్ట్ర ప్రయోజ నాలు కాపాడడానికి ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. ఏపీకి, చంద్రబాబు కు గురు దక్షిణ చెల్లించేందుకు ప్రజ లు నిన్ను ఎన్నుకోలేదు, నిజం ని ప్పు లాంటిది వాస్తవం దాగదు ఎ ప్పటికైనా రాష్ట్ర ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రా ష్ట్ర ప్రజలకు అబద్దాలు చెప్పినందు కు క్షమాపణ చెప్పాలని, రేవంత్ రె డ్డి బుకాయించడం అంటే ప్రజలను వంచిచడమే, మోసం చేయడమే అ ని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ పా లన కాదు, బిజేపీ, టీడీపీ రిమోట్ పాలన అంటూనే ఆ విషయం ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అన్నారని గుర్తు చేశారు. బనకచర్లపై మీటింగ్ పెడితే కలిసేదే లేదు అన్నడు, ఈరోజు ప రుగు పరుగున వెళ్లిండు, కమిటీ వే యడానికి ఒప్పుకున్నడు. చంద్రబా బు చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది.
రాష్ట్రానికి నష్టం జరిగితే రాష్ట్ర ప్ర యోజనాలు దెబ్బతింటే పోరాటం చేస్తా, సుప్రీం కోర్టుకు వెళ్తా అనాలి.
కాని ఒప్పుకుంటా అని ఎలా అంటా వు రేవంత్ రెడ్డి అని నిప్పులు చెరి గారు.

కేంద్ర ప్రభుత్వం గోదావరి బనకచర్ల మీటింగ్ పెట్టడమే తప్పు, సెంట్రల్ వాటర్ కమిషన్, జీఆర్ఎంబీ, పో లవరం ప్రాజెక్టు అథారిటిలు బన కచర్ల ప్రీ ఫీజబులిటి రిపోర్టును తిర స్కరించాయని, పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థలు నిర్ద్వంద్వం గా అనుమతులు తిరస్కరించా య ని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్క రించాక కేంద్రం ఎలా మీటింగ్ పె ట్టిందన్నారు.

రేవంత్ రెడ్డి వెళ్లి కమీటి వేయండి, కమిటీ ఎట్ల చెబితే గట్ల అని ఎట్ల అంటడు.రాష్ట్ర విభ జన చట్టం, జీ ఆర్ఎంబీ, అపెక్స్ అనుమతి ఇవ్వ కుండా బనకచర్లను రిటర్న్ కొడితే, దానికి రేవంత్ రెడ్డి నేడు కమిటీపై సంతకం పెట్టడం ఏమిటి.రేవంత్ తెలంగాణకు చేస్తున్న ద్రోహం ఇది. తెలంగాణ పాలిట రేవంత్ మరణ శాసనం రాసిండని దుయ్యబట్టారు.
కేసీఆర్ ఉన్నంత కాలం, బిఆర్ఎస్ ఉన్నంత కాలం తెలంగాణకు అన్యా యం జరిగితే సహించేది లేదని పు నరుద్ఘాటించారు. బిజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు.

అపెక్స్ మీటింగ్ డిమాండ్ చేయ కుండా ఇంటర్నల్ మీటింగ్ పెడితే ఎందుకు వెళ్లిండు, బిజేపీ ఒత్తిడి నా, బాబు ఒత్తిడినా ఏ ఒత్తిడి పని చేసింది.బాబు, బిజేపీతో ఉన్న బా యి బాయి రాజకీయాలపై, ఒప్పం దాలపై రేవంత్ సమాధానం చెప్పా లని, తెలంగాణకు తీరని ద్రోహం చే సిన వ్యక్తి, పాలమూరును వ్యతిరే కించిన వ్యక్తిని రాష్ట్ర సలహాదారు గా ఎలా పెట్టుకుంటారు, పాలన రే వంత్, డైరెక్షన్ చంద్రబాబు చెబితే రేవంత్ పదవులు ఇస్తున్నాడు.
కాంగ్రెస్ నామినెటెడ్ పోస్టుల్లోనూ బాబు మాటలు రేవంత్ శిరసా వ హిస్తున్నడని ఆరోపించారు. చంద్ర బాబును విమర్శించాల్సింది పో యి, కేసీఆర్ ను విమర్శిస్తవా,
మొన్నటి పీపీటీలో చంద్రబాబును ఒక్క మాట అనలేదు. పోరాటం ఎ వరి మీద తెలంగాణ సాధించిన కేసీ ఆర్ మీదనా, తెలంగాణకు మోసం చేస్తున్న చంద్రబాబు మీదనా అం టూ ప్రశ్నలవర్షం కురిపించారు.

ఏపీలో కూటమి పాలన, తెలంగాణ లో విష కూటమి పాలన నడుస్తు న్నది టెలిమెట్రీ కొత్తగా పెట్టిందేం ఉంది. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు వర కు బిఆర్ఎస్ హయాంలోనే పెట్టారు
అన్ని ప్రాజెక్టుల వద్ద పెట్టాలని బి ఆర్ఎస్ అడిగింది.కేఆర్ఎంబీ ఆఫీ సు హైదరాబాద్ నుంచి విజయవా డకు తీసుకుపోతే విజయం సాధిం చిన అంటడు.అధికారంలోకి రాగా నే కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎం బీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న డు.కేసీఆర్ గర్జిస్తే నిర్ణయం వెనక్కి తీసుకున్నరు. కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయించారు. 20నెలల్లో నువ్వు సాధించింది ఏముంది రేవం త్ రెడ్డి అన్నారు.

పెద్దవాగు కొట్టుకుపోయింది, సుంకి శాల కూలింది, ఎస్ ఎల్ బీసీ కుప్ప కూలింది, జూరాల గేట్లు రోప్స్ తెగి పోయినయి.కృష్ణాలో 500 టీఎం సీలు చాలు అని అనడానికి నువ్వు ఎవరు రేవంత్ రెడ్డి, కృష్ణాలో న్యా యమైన వాటా కోసం సెక్షన్ 3 సా ధించిండు కేసీఆర్ ట్రిబ్యునల్ అవా ర్డు వస్తే ఏడు, ఎనిమిది వందల టీ ఎంసీలు వస్తయి, ముఖ్యమంత్రి, నీ టి పారుదల శాఖ మంత్రికి అవ గాహన లేదు, చిత్త శుద్ది లేదు
17.24లక్షల ఎకరాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ఆయకట్టు తెచ్చిం ది. 30లక్షల ఎకరాలు స్థిరీకరణ చేసాం, 20 నెలల్లో ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చావా రేవంత్ రెడ్డి
కేసీఆర్ ను తిట్టడం తప్ప, తెలం గాణ సాగు నీటి రంగంలో కాంగ్రెస్ సాధించింది గుండు సున్ననోటి తీట తప్ప, నీటి వాటా సాధించాలనే చి త్త శుద్ది లేదని విమర్శించారు.

మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టొద్దని రి టర్న్ ఇంజినీర్లు చెప్పారని అబద్దా లు చెప్పిండు.గోదావరి మీద నిపు ణుల సలహాలు అడుగు. ఎవర్ని అ డగకుండా ఎందుకు పోతవు
పరుగెత్తి ఎందుకు మీటింగ్ వెళ్లావు, ఎందుకు కమిటీకి ఒప్పుకున్నావు
రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం ఇది. ఈ ద్రోహానికి నిన్ను ఎన్ని కొరడాలు కొ ట్టాలి రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ల విషయంలో ని జాయితీ ప్రదర్శించు, లేదంటే తె లంగాణ ప్రజలు నీళ్లలో ముంచు తారు.ఇచ్చే నీళ్ళు వాడుకునే తె లివి లేదు. తాత్కాలిక వాటా ప్రకా రం నీళ్లు వాడుకోని చేతగాని దద్ద మ్మ ప్రభుత్వం కాంగ్రెస్ 65 టీఎంసీ లు ఏపీకి, చంద్రబాబుకు గురుదక్షి ణగా ఇచ్చారని ఆరోపించారు.

కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయాలని మేం అడిగితే అప్పుడు నిద్ర లేచి ఒ త్తారు 36రోజులు నీళ్లు కిందకు వెళ్లి పోయాయి కదా, ఈరోజు చేసిన ద్రో హానికి చెంపలు వేసుకోవాలి, బేషర తుగా క్షమాపణ చెప్పాలి. ఎట్టి పరి స్థితిలో బీఆర్ఎస్ బనకచర్లను ఒ ప్పుకోదు.అఖిల పక్షం డిల్లీకి తీసు కుకోవాలని గతంలోనే డిమాండ్ చే సాం. మాకు బేషజాలు లేవు, మా కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. మీలాగా రాజకీయాలు ముఖ్యం కాదు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి, బాబు ప్రయోజనాల కోసం చే సావు రేవంత్ రెడ్డి చీకటి ఒప్పదం తేటతెల్లం అయ్యింది. బేషరతుగా క్షమాపణలు చెప్పు అని డిమాండ్ చేశారు.