–ముందుగా మేల్కొనకపోవడం తోనే తీవ్ర వరద నష్టం
–బాధితులకు మంచినీళ్లు కూడా ఇవ్వని ప్రభుత్వం
–సాయం చేసే మా చేతులపైనే దా డులు
— కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao: ప్రజా దీవెన, సిద్దిపేట: రాష్ట్రంలో నడుస్తున్నదని ప్రజా పాలన కాద ని, రాక్షస పాలన అని మాజీ మం త్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (Harish Rao) తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లెవరూ లేదరని చెప్పారు. వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిం దని విమర్శించారు. సిద్దిపేట క్యాం పు కార్యాలయం వద్ద ఖమ్మం వర ద బాధితులకు సరుకులు పంపే వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లా డుతూ ఖమ్మం, మహబూబాబా ద్‌లో (Khammam, Mahbubabad)వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిం దన్నారు.
ప్రభుత్వం ముందుగా మేల్కొంటే మరింత ప్రాణనష్టం తగ్గే అవకాశం ఉండేదన్నారు.సిద్దిపేట నుంచి ఉడుతా భక్తిగా సహాయం చేస్తున్నామన్నారు హరీశ్ రావు. మానవ సేవయే మాధవ సేవ (Human service is Madhava service)అని అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు (MLAs, MPs, MLCs)నెల వేతనం వరద బాధితులకు అందిస్తున్నామని చెప్పారు. తమలాగే బీజేపీ, మిగిలిన పార్టీల నాయకులు సహాయం చేయడానికి మందుకు రావాలన్నారు. తాము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే తమపై దాడి చేసి కేసులు (case) నమోదుచేస్తున్నారని వెల్లడించారు. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారని వెల్లడించారు. తమకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే దాడులు చేస్తున్నారని విమర్శించారు. బాధితులకు అన్నం, నీళ్లు ఇవ్వలేకపోయారని రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు హరీశ్.