Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao : హరీష్ రావు ఆగ్రహం, ప్రజాభవన్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్ర చారం

Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే అది పక్కన బె ట్టి అబద్దాలతో నిండిన పీపీటీల కం పు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుం టున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. సీఎం రే వంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి పనికిరాని పీపీటీలతో మరోసారి అజ్ఞానాన్ని బయట పెట్టు కున్నారన్నారు. బుధవారం ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో సా రాంశం ఆయన మాటల్లోనే…

నిజాలు చెప్పే దమ్ములేక తప్పుడు లెక్కలతో, తప్పుడు మాటలతో మ భ్య పెట్టే ప్రయత్నం చేయడం తప్ప మీరు చేసిందేం లేదు. ప్రతిపక్షాల మీద నిందారోపణలు చేయడానికి ఇంత నీచమైన స్థాయికి దిగజారు తారా, మీ అబద్దాలను చూసి యా వత్ తెలంగాణ సమాజం అసహ్యిం చుకుంటున్నది.మీరు చెప్పిన ప్రతి మాట పచ్చి అబద్దమే అని అసెంబ్లీ లోపల, బయట అనేక సార్లు సాక్షా ధారాలతో సహా వివరించాను.
అయినా కుక్క తోక వంకర అన్న ట్లు పదే పదే చెప్పిన అబద్దాలు చె బుతూ నిజాలుగా భ్రమింపచేసే కు ట్రలకు పాల్పడుతుండటం సిగ్గు చేటు.

తెలంగాణ వాదులు బయట ఉంటే, తెలంగాణ ద్రోహులంతా ప్రజా భ వ న్ లో చేరి అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేసారు.50 ఏండ్ల పాలన లో తెలంగాణ నీటి పారుదల రంగా న్ని, సాగు రంగాన్ని నిర్వీర్యం చేసిం ది కాంగ్రెస్ పార్టీ. పదవుల కోసం పె దవులు మూసుకొని ఆంధ్రాకు దా సోహం అన్నది నాటి మంత్రులుగా ఉన్న నేటి మంత్రులు. ఇప్పుడు మ ళ్లీ అదే రీతిలో ఆంధ్రాకు నీళ్ల తర లింపులో తోడ్పాటు అందిస్తున్నది కాంగ్రెస్ పార్టీ.అప్పుడు, ఇప్పుడూ ఎప్పుడూ మీది ద్రోహ చరిత్రనే రే వంత్ రెడ్డి.

దయ్యాలు వేదాలు వల్లించినట్లు నే డు సుద్దపూస మాటలు మాట్లాడు తున్నవు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజె క్టును పక్కనబెట్టి రంగారెడ్డి, నల్గొం డ ప్రాంతాలను విస్మరించామని వి భజన చట్టం చూపుతూ తప్పుదోవ పట్టించిన రేవంత్ రెడ్డి,పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నాగర్ క ర్నూల్, మహబూబ్ నగర్, నారా యణ పేట్, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని 70 మండ లాలు, 1226 గ్రామాల్లోని 12.30 లక్షల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే విష యం గురించి దాచి పెట్టే కుట్ర ఎం దుకు చేస్తున్నావు.

ఉమ్మడి రాష్ట్రంలో 50లక్షల ఎక రాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇ చ్చిందని పచ్చి అబద్దాలు చెబు తున్న రేవంత్ రెడ్డి దమ్ముంటే ఆ ధారాలు బయటపెట్టు. బిఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్లలో 48.74 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా. ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు నీ కు ఇచ్చిన నివేదికలోనే ఇది ఉంది.
మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానిత నం వల్లనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మూలన పడింది.

తమ్మిడి హట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు చేపట్టేందుకు మ హారాష్ట్ర ఒప్పుకోకున్నా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు తవ్వి, మొబిలైజేషన్ అడ్వాన్సులను కాం ట్రాక్టర్లకు కట్టబెట్టింది నిజం కాదా
ప్రాణహిత డిజైన్ తో 3 వేల ఎకరా లకు పైగా ముంపు ఉంటుందని మ హారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యం తరం వ్యక్తం చేసింది నిజం కాదా?
ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ అప్పటి మహారాష్ట్ర సీఎం పృధ్వి రాజ్ చ వాన్ నాటి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కి లేఖ రాయడం నిజం కాదా? ప్రతిపాదించిన రీతిలో ప్రా జెక్టుకు ఒప్పుకోబోమని, అయినా ప్రాజెక్టు కడితే ఖర్చు వృథా కాక త ప్పదని చవాన్ హెచ్చరించిన మాట వాస్తవం కాదా, చాప్రాల్ వన్యప్రాణి అభయారణ్యంతో తమ్మడిహట్టి ప్రా జెక్టుకు సమస్య ఉండటం వాస్తవం కాదా, కేంద్ర జలసంఘం నీటి ల భ్య త లేదని చెప్పడం వాస్తవం కాదా, ఏ సమస్య లేకున్నా బిఆర్ఎస్ ప్ర భుత్వం ప్రాణహిత ప్రాజెక్టును ప క్కనబెట్టిందని చెప్పడం పచ్చి అబ ద్దం.

2007లో మొదలు పెట్టిన ప్రాజెక్టు ను 2014 వరకు ఎందుకు పూర్తి చేయలేదు. కనీసం అనుమతులు కూడా ఎందుకు సాధించలేదు,
కేంద్రంలో, మహారాష్ట్ర, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఎందుకు చేతులు ముడు చుకొని కూర్చొన్నారు, ప్రాణహిత చేవెళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ. 17, 875 కోట్లతో నిర్మించేందుకు 2007 మే నెలలో జివో నెంబర్ 124 విడు దల చేసారు. కేవలం 19 నెలల్లోనే 38, 580 కోట్లకు అంచనాలు పెం చుతూ జీవో ఇచ్చారు.

కేంద్ర జలసంఘానికి ప్రతిపాదనలు పంపినప్పుడు 40 వేల 300 కోట్లకు పెంచారు. కమీషన్ల కోసం అంచనా లు పెంచామంటున్న ఉత్తం, ఏ క మీషన్లు దండుకునేందుకు 17వేల కోట్ల నుంచి 40వేల కోట్లకు అంచ నాలు పెంచారు ఎవరి జేబుల్లోకి అవి వెళ్లాయి, ప్రాణహిత చేవెళ్ల ప్రా జెక్టు తెలంగాణ ప్రాంతానిది కనుకే అప్పటి కాంగ్రెస్ పార్టీ అంతర్రాష్ట్ర కిరికిరి లో పెట్టి, పనులు ముందుకు పోనివ్వనిది నిజం కాదా? మసి పూ సి మారేడు కాయ చేస్తే నిజాలు దాగవు.

మేడిగడ్డ ను పడావు పెట్టి నీళ్లను కిందకు వదిలి చోద్యం చూస్తున్న రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి 20 నెలలు అయ్యింది.మేడిగడ్డను రిపేర్ చేయాలని ఎన్డీఎస్ఏ చెప్పి నా, ఎల్ అండ్ టీ రిపేర్ చేయడాని కి సిద్దపడినా ఎందుకు మరమ్మతు లు చేయడం లేదు.అప్పుడు ప్రా ణహిత చేవెళ్ల ప్రాజెక్టును పడావు పెట్లారు, ఇప్పుడు మేడిగడ్డను పం డబెడుతున్నరు. రైతు ప్రయోజ నా ల కంటే మీకు రాజకీయ ప్రయోజ నాలే ఎక్కువ, తెలంగాణ ప్రయోజ నాల కంటే ఆంధ్రాకు నీళ్లు తరలించ డం పైనే దృష్టి. మేడిగడ్డ బ్యారేజీ మీది నుంచి వాహనాలు అనుమతించాలని ఎన్డీఎస్ఏ నీకు చెప్పిందా?

కూలిందని చెప్పుకుంటూనే ఎందు కు రాకపోకలు అనుమతిస్తున్నారు.
ఏ నిపుణుల కమిటీ చెప్పంది రేవం త్ రెడ్డి? అసెంబ్లీకి నిపుణులను పి లవడం కాదు, నీ జూబ్లీ హిల్స్ ప్యా లెస్ కు నిపుణులను పిలుచుకొని ముందు మాట్లాడు. తర్వాత సుద్దు లు చెబుదువు గాని. జూరాల జలా శయం నికర నిల్వ సామర్థ్యం 7 టి ఎంసిలు మాత్రమే. దీని మీద ఇప్ప టికే బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ లోని తదితర పట్టణాల తాగు నీటి అవసరాలు ఉన్నాయి. దీనికి అద నంగా రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపో సే పాలమూరు ప్రాజెక్టు భారం మో పడం సాధ్యమవుతుందా? పాల మూరు బిడ్డను అని చెప్పుకునే నీకు ఆ మాత్రం తెల్వదా రేవంత్ రెడ్డి.

కృష్ణా జలాల్లో 299:512 వాటాకు రాష్ట్రం ఏర్పడక ముందే ఒప్పుకొని మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాటి కాంగ్రెస్ చేసిన తప్పు కు తెలంగాణ ఇప్పటికీ శిక్ష అనుభ విస్తున్నది.సెక్షన్ 3 సాధించింది కే సీఆర్, ట్రిబ్యునల్ ముందు 573 టీ ఎంసీలకు అఫిడవిట్ ఇచ్చింది కేసీ ఆర్ ప్రభుత్వం.అబద్దాలను అందం గా చెప్పే రేవంత్ రెడ్డి. ఎవర్ని కొర డా దెబ్బలు కొట్టాలె? ద్రోహం చేసిం ది ఎవరు..కొరడా దెబ్బలు తినా ల్సింది ఎవరు? 50 ఏండ్లు తెలం గాణ నీటి హక్కులను కాలరాసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొరడా దెబ్బ లు కొట్టాలె.గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటాను ఆంధ్రాకు అప్ప జెప్పిన కాంగ్రెస్ నాయకులను కొర డా దెబ్బలు కొట్టాలె.కృష్ణా నీళ్లను పోతిరెడ్డి ద్వారా రాయలసీమకు తరలిస్తుంటే హారతులు పట్టిన ఆ నాటి కాంగ్రెస్ మంత్రులను కొట్టాలె.
బనకచర్ల ద్వారా ఏపీకి గోదావరి, కృష్ణా నీళ్లను దారాదత్తం చేసేం దు కు కుట్రలు చేస్తున్న నిన్ను కొరడా దె బ్బలు కొట్టాలె రేవంత్ రెడ్డి.

రాష్ట్ర ప్రభుత్వం అధికార భవన్ లో అధికారికంగా నిర్వహించిన నేటి స మావేశానికి మీ పార్టీ ప్రజాప్రతినిధు లను, పార్టీ ఫిరాయించిన ప్రజా ప్రతి నిధులను మాత్రమే ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చే యడమే.ఇరిగేషన్ పై చర్చకు రా అంటూ రంకెలు వేసే రేవంత్ రెడ్డి.. ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎందుకు పిలవలేదు.నీ సవాల్ లో నిజాయి తీ ఉంటే ఎందుకు ప్రజా భవన్ కు ఆహ్వానించలేదు.ఇది ఎమ్మెల్యేల ప్రివిలేజ్ కు భంగం కల్పించడమే. దీనిపై బిఆర్ఎస్ పార్టీ శాసనసభ స్పీకర్ గారికి, శాసన మండలి చైర్మ న్bకి ప్రివిలేజ్ మోషన్ ఇస్తుంద న్నారు.