Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao: తెలంగాణకు కేంద్రం గుండు సున్నా

–గోదావరి పుష్కరాలపై వివ‌క్ష‌ చూపుతోన్న కేంద్రం
–మాజీ మంత్రి హరీశ్ ఆగ్ర‌హం

Harish Rao: ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపిందని మాజీ మంత్రి త‌న్నీరు హరీష్ రావు (Harish Rao)తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గోదావరి పుష్కరాల(godavari Pushkar)కోసం ఆంధ్ర ప్రదేశ్‌కు ₹100 కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు మాత్రం గుం డుసున్నా మిగిల్చిందని తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు(mps), ఇద్దరు కేంద్ర మంత్రులున్నా, రాష్ట్రా నికి ఒక్క రూపాయి కూడా సాధిం చలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయడంలో బీజేపీ(bjp), కాంగ్రెస్ పార్టీ లు పూర్తిగా విఫలమయ్యా యిని అన్నారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ (brs)ఉండి ఉంటే, ఇలాంటి అన్యాయం జరిగేది కాదని తెలిపారు.

కేంద్ర బడ్జె ట్లోనూ తెలంగాణకు (Telangana)సున్నా కేటా యింపులు చేసి, ఏపీకి అడిషనల్ గ్రాంట్ కింద 15,000 కోట్లు ఇచ్చా రని హరీశ్రావు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్కు నిధులు ఇచ్చారని మా బాధ కాదు, తెలంగాణకు అన్యా యం జరుగుతోందనేదే మా ఆవే దన అని హరీష్(Harish Rao)స్పష్టం చేశారు. నిధుల కేటాయింపులో తెలంగా ణకు మొదటి నుండి కేంద్ర ప్రభు త్వం మొండి చెయ్యే చూపుతోం దని అన్నారు. తెలంగాణ రాష్ట్రంపై ఇంత వివక్ష ఎందుకు అని ప్రశ్నిం చారు. తెలంగాణను ఇతర రాష్ట్రా లతో సమానంగా చూడాలని, హ క్కుగా రావాల్సిన నిధులను కచ్చి తంగా ఇవ్వాలని డిమాండ్చేస్తు న్నామని తెలిపారు.