Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో సన్న వడ్లకు బోనస్ పేరు తో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తూనే ఉందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండి పడ్డారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట లు గొప్పగా, చేతలు మాత్రం చేదు గా ఉన్నాయని ధ్వజమెత్తారు. ము ఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి హరీష్ రావు రాసిన లేఖ సారాంశం ఆయన మాటల్లోనే 48 గంటలు కా దు 48 రోజులైనా బోనస్ డబ్బులు రాలేదు. సన్నవడ్లకు 8 లక్షల 64 వేల మెట్రిక్ టన్నులకు 432 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉంది. సన్న వడ్లకు బోనస్ వి డు దల చేయాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల సమ యంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీ రు అనేక హామీలను ఇచ్చారు. అం దులో 2లక్షల రూపాయల రుణ మాఫీ అంతంత మాత్రమే పూర్తి చేసారు. రైతు భరోసా పె ట్టుబడి సాయానికి కోతలు పెట్టారు. ఇప్పు డేమో సన్నవడ్లకు మీరు ఇస్తానన్న బోనస్ డబ్బులను బోగస్ అన్నట్లు గానే ఎగవేస్తున్నారు. రైతు పండిం చిన అన్ని పంటలకు క్వింటాలుకు 500 బోనస్ ఇస్తామని ఆనాడు ప్రకటించి యూటర్న్ తీసుకున్నా రు. అన్ని పంటలకు బదులు కేవ లం సన్న వడ్లకే బోనస్ ఇస్తామని మాట మార్చారు. మీ బోనస్ హామీ ఒక బోగస్ హామీగా మారిపోయిం ది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,6 4,000 మెట్రిక్ టన్నుల దాన్యానికి సంబందించిన 432 కోట్ల రూపాయ ల బోనస్ చెల్లింపులు పెండింగ్ లో నే ఉన్నాయి. వరి దాన్యం కొనుగో లు నిలిపివేసి దాదాపు 50 రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఇంత వ రకు రైతుల ఖాతాల్లో బోనస్ డ బ్బులు జమ కాలేదు.
రెండో పంట కు సిద్దం కావాల్సిన రైతులు బోనస్ డబ్బుల కోసం ప్రభుత్వ అదికా రుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి దాపురించింది. నిన్నటికి నిన్న మ హబూబ్ నగర్ జిల్లాలో ముచ్చిం తల రైతులు తమ వడ్లు అమ్మి రెండు నెలలు అయినా ప్రభుత్వం బోనస్ చెల్లించడం లేదంటూ జిల్లా కలెక్టర్ ను కలిస్తే బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉన్నది నిజమే, ప్రభు త్వం విడుదల ఆలస్యం అవుతుం దని సమాదానం ఇచ్చారు. బహి రంగ మార్కెట్ లో 2800 రూపా యల నుండి 3000 రూపాయల ధర పలుకుతున్నా బోనస్ కోసం రైతులు ప్రభుత్వాన్ని నమ్మి దా న్యాన్ని విక్రయిస్తే, తమను ప్రభు త్వం మోసం చేసిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరం గల్ రైతు డిక్లరేషన్ అబద్దమా మీ రిచ్చిన బాండ్ పేపర్ బూటక మా సమాదానం చెప్పాలి కేసీఆర్ పాల నలో రైతులంతా గుండెధైర్యంతో వ్యవసాయాన్ని పండగలా చేసారు. కానీ మీ పాలనలో వ్యవసాయం దండగలా మారి రైతు ఆత్మహ త్యలకు పాల్పడుతున్నారు .మీ రైతు డిక్లరేషన్ లో ప్రకటించినట్లు గా 2 లక్షల రుణమాఫీ, ఎకరానికి 15 వేల రూపాయల రైతుభరోసా, అన్ని పంటలకు బోనస్,కౌలు రైతు లకు కూడా రైతు భరోసాను 100 రోజుల్లో అమలు చేస్తానని దేవు ళ్ళ సాక్షిగా మీరు ప్రమాణం చేసి మాట ఇచ్చారు. కానీ 420 రోజులు పూర్తైనా ఏ ఒక్కటి కూడా సంపూ ర్ణంగా అమలు చేయలేదు. రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి వారి పక్షాన తక్షణమే హామీలు అ మలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.