–వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలని ప్రజలను ముప్పు తిప్పలు పెడు తున్నారు
— మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామసభలో పురుగుల మం దు తాగి ఆత్మహత్య చేసుకున్న ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య ఆసుప త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానిం చారు. పట్టించుకోవాల్సిన ప్రభు త్వం చోద్యం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖం చాటేస్తే, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పింది బిఆర్ఎస్ పార్టీ నాగ య్యకు మంచి వైద్యం అందించి, ప్రాణాలు కాపాడేందుకు ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రయ త్నించింది కానీ దురదృష్టవశాత్తు నాగయ్య ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇ వ్వాలని అధికారులకు చెబుతూ పురుగుల మందు తాగి, ఆసుపత్రి పాలైన నాగయ్య దుస్థితికి ప్రభుత్వ మే కారణమని దుయ్యబట్టారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు.
ఉన్నదాంతో కుటుంబాన్ని పోషిస్తూ జీవితం గడుపుతున్న నాగయ్య కుటుంబంలో గ్రామ సభల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిప్పులు పోసిం దని, భర్తను, తండ్రిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న భా ర్య, ముగ్గురు ఆడబిడ్డలను ఎవరు ఆదుకోవాలని ప్రశ్నించారు. పంచా యతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా, జాబి తా విడుదల చేస్తూ ప్రజల్లో గంద రగోళం రేపింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. దీంతో పాటు, కాంగ్రె స్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అం టూ బాహాటంగా ప్రకటించడంతో గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పట్ల ప్రజల్లో ఆందళన మొ దలైందన్నారు. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, ఏడాది పాల నలో మీరు చేసిందేముందన్నారు.
గ్రామ సభల సాక్షిగా తిరగబడ్డ జ నం, ఎక్కడిక్కడ నిలదీసిన దృ శ్యా లు మీ 14 నెలల పాలన వైఫల్యా న్ని ఎత్తి చూపాయన్నారు. రోడ్డున పడ్డ నాగయ్య కుటుంబాన్ని ప్రభు త్వం అన్ని విధాలా ఆదుకోవాలని, రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రక టించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బి ఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తు న్నామన్నారు.
రాష్ట్ర ప్రజలారా ఆత్మహ త్యలు పరిష్కారం కాదు…
రాష్ట్ర ప్రజలారా ఆత్మహత్యలు పరి ష్కారం కాదు. నమ్మి ఓటేసినందు కు నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడుదాం. హక్కుగా రావాల్సిన పథకాలను సాధించు కుందాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అం డగా ఉంటుంది. ధైర్యం కోల్పో వ ద్దని, ఆత్మహత్యలకు పాల్పడ వ ద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపు నిచ్చా రు హరీష్ రావు.