–మంత్రులంతా తలో మాట మాట్లాడుతున్నారు
–ఇంకా 54 శాతం రుణమాఫీ కావాల్సి ఉంది
–దేవుళ్లపై ఒట్టేసి మోసం చేయొద్దు ప్రాయచ్చిత్తం చేసుకోండి
Harish Rao: యాదాద్రి: రుణమాఫీ (Loan waiver) చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao)విమర్శించారు. రుణమాఫీ (Loan waiver) పేరుతో రైతులనే కాదు, దేవుళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి చెప్పారు, మంత్రులేమో తలో మా టా మాట్లాడుతున్నారని అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వా మిని గురువారం దర్శనం చేసుకు న్న అనంతరం పార్టీ నాయకులతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఇంకా 17 లక్షల మం దికి మాఫీ చేయాల్సి ఉందని మం త్రి ఉత్తమ్ (uttam) అన్నారన్నారు. రుణమా ఫీ పూర్తికాలేదని పొంగులేటి అంటు న్నారని చెప్పారు. రుణమాఫీకి మరో రూ. 12 వేల కోట్లు ఇంకా ఇవ్వాలని అంటున్నారని వెల్ల డించారు.
రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు (farmers) రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేయాలని మంత్రి తుమ్మల చెప్పారు. ఇప్పటివరకు 22 లక్షల మందికి రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశామన్నా రు. తుమ్మల లెక్కల ప్రకారం 42 లక్షల మంది రైతులకుగాను 22 లక్షల మందికే మాఫీ అయ్యింది. అంటే ఇప్పటివరకు 45శాతం మంది రైతులకు మాత్రమే రుణ మాఫీ చేశారు. ఇంకా 54 శాతం మంది రైతులకు మాఫీ డబ్బు బ్యాంకుల్లో జమచేయాలి. మరి మంత్రుల లెక్కల ప్రకారం రాజీ నామా ఎవరు చేయాలి అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి నీతి, నిజాయితీ ఉంటే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఏ దేవుళ్లపై ఒట్లు పెట్టారో ఆ దేవుళ్ల వద్దకు వెళ్లి రేవం త్ రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని హరీశ్‌రావు అన్నారు. తాను తెలం గాణ కోసం మంత్రి పదవికి, ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. పాలకుడు పాపం చేస్తే ప్రజలకు అరిష్టం అని బ్రాహ్మణ ఉత్తములు (Brahmins are the best) చెప్పారు. అందుకే ప్రజలకు అరిష్టం కలుగకుండా పాపం చేసిన సీఎంను క్షమించాలని మొక్కుకున్నా, ప్రజలను రక్షించాల ని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ని వేడుకున్నాని చెప్పారు. రైతులం దరికి రుణమాఫీ, పంటల బోనస్ ఇచ్చేంత వరకూ పోరాడే శక్తిని ఇవ్వాలని వేడుకున్నానన్నారు.