Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

He tried to commit: ఆత్మహత్యకు యత్నించి అసువులుబాసారు 

ఆత్మహత్యకు యత్నించి అసువులుబాసారు 

–ఇద్దరు డిగ్రీ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
— ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు
— నల్లగొండ లోనే మరో యువకుడి బలవర్మనం
— ఒక్కరోజే ముగ్గురు యుక్త వయస్సు పిల్లలు చనిపోయారు

ప్రజా దీవెన/నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అసువులుబాసారు. మరో యువకుడు ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒక్కరోజే ముగ్గురు యుక్త వయసు పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం కలిచివేసింది. కాగా నల్లగొండ పట్టణంలోని రాజీవ్ పార్కులో మంగళ వారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

నార్కట్ పల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామానికి చెందిన దొంతరబోయిన శివాని, అదే మండలంలోని అమ్మన బోలు గ్రామానికి చెందిన అనుగూతల మనీష ఇంటర్మీడి యట్ నుంచి స్నేహితులుగా కొనసాగుతూ నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల ఎస్సీ హాస్టల్లో ఉంటూ నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.

గత 20 రోజులుగా ఇంటి వద్దనే ఉన్న వీరిద్దరు కళాశాలకు వెళ్తామని కుటుంబ సభ్యులకు చెప్పి మంగళవారం ఉదయం బస్సులో నల్లగొండకు వచ్చారు. అనంతరం ఎన్జీ కళాశాల వెనుక ఉన్న రాజీవ్ పార్కులోకి ఇద్దరూ వెళ్లి గడ్డి మందు తాగి పార్కు గేట్ వద్దకు వచ్చి బిగ్గరగా అరవడం ఆరంభించారు.

ఆ పక్కనే ఉన్న ఇళ్లలోని వారు గమనించి ఏం జరిగిందని ఆరా తీస్తూనే  పోలీసు లు,  108 సిబ్బందికి సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థినులను నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా వారిద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.

ఆత్మహత్యాయత్నంకు గల కారణాలు ఏమిటని శివాని, మనీషను పోలీసులు ప్రశ్నించగా ఇన్స్టాగ్రామ్లో కొంతమంది బెదిరించారని చెప్పారు. ఈ మేరకు వారిద్దరి ఫోన్లను పోలీసులు పరిశీలించగా ఇన్స్టాగ్రామ్ లో ఎవరూ వారిని వేధించలేదని నిర్ధారించారు. వారి ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా ఇద్దరు విద్యార్థినుల మధ్యే ఎక్కువగా ఫోన్ సంభాషణ ఉన్నట్లు తెలిసింది.

తమ పిల్లల ఆత్మహత్యకు గల కారణాలు తెలియదని పోలీసులే విచారించాలని శివాని తండ్రి సైదులు, మనీష తండ్రి మల్లయ్య నల్లగొండ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడ్డి మందును నార్కట్పల్లిలో కొను గోలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వారి బ్యాగులో నిద్రమాత్రలు లభించాయి.

విద్యార్థినులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఆత్మహత్యాయత్నానికి ఉండొచ్చని పోలీసులు బావిస్తున్నారు. ఇదిలాఉండగా నిన్నటి రోజున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఇద్దరు యువతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.

*నల్లగొండలోనే మరో యువకుడి బలవన్మరణం…* వ్యక్తిగత కారణాలతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినసంఘటన నల్లగొండ లోనే జరిగింది.  చింత మల్ల శ్రీనివాస కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు చింతమల్ల దిలీప్ చక్రవర్తి(24) డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసి సెల్ఫోన్ దుకాణంలో పనిచేస్తూ రోజూ మాదిరిగానే శ్రీనివాస్ ఆఫీస్కు వెళ్లగా చిన్నకుమారుడు కళాశాలకు, కుమార్తె స్కూల్కు వెళ్లారు. మొబైల్ దుకాణానికి వెళ్లేందుకు సమయం కావడంతో తల్లి ఉషారాణి చక్రవర్తిని నిద్రలేపి తయారుకావాల్సిందిగా చెప్పి బాత్రూంకు వెళ్లింది.

ఇదే సమయంలో దిలీప్ చక్రవర్తి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాత్రూం నుంచి తిరిగి వచ్చిన తల్లి దిలీప్ చక్రవర్తిని చూసి కేకలు వేయడంతో చుట్టుప్ర క్కల వారు అక్కడికి చేరుకుని చూసేసరికే అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. దిలీప్ చక్రవర్తి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.