–ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్
Headmistress Suspension : ప్రజాదీవెన నల్గొండ : నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అవీనీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ లు ఆరోపించారు.
గత మూడు రోజులుగా ఎలాంటి సెలవు పెట్టకుండా, ఉన్నత స్థాయి అధికారుల అనుమతి తీసుకోకుండా, కనీసం వేరేవారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించకుండా ప్రభుత్వ పాఠశాలను రోడ్డుపాలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నరని తక్షణమే ప్రధానోపాధ్యాయురాలు ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయురాలు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత మార్చి నెలలో పాఠశాలకు అభివృద్ధి నిధులు సుమారు 7 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని వివరించారు. ప్రభుత్వ నిధులను అడ్డగోలుగా ఖర్చు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ విద్యార్థుల రక్తాన్ని తాగుతున్న చిట్యాల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తను ఆడిందే ఆట.. పాడిందే పాట అంటూ ఇష్టానుసారం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్యాల పాఠశాలను సందర్శించి ప్రభుత్వ నిధులను రోడ్డుపాలు చేసిన చిట్యాల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రధానోపాధ్యాయులు ఉండటం మూలంగానే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని, ప్రభుత్వ విద్యా వ్యవస్థ కే మచ్చ చేస్తున్న చిట్యాల ప్రధానోపాధ్యాయురాలుని జిల్లా విద్యాశాఖ అధికారులు కాపాడుచున్నారని అన్నారు. పాఠశాలను అభివృద్ధి పరచాల్సిన ప్రధానోపాధ్యాయురాలు అన్ని తప్పుడు బిల్లు పెట్టి వచ్చిన డబ్బులను బుడిదలో పోసిన పన్నీరు లా మార్చరని మండిపడ్డారు.
కనీసం పాఠశాల భవనానికి కలర్ పెయింటింగ్ కూడ వేయించలేదు. పాఠశాల భవనంపై పాడైన సామానులు వేసి పాఠశాలను చెత్తకుండీగా మార్చారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ చిట్యాల లో వున్నా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను తక్షణమే సందర్శించి ఆయా పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.