Health Center: ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య పరీక్షలకు (Health Center) హాజరైన గర్భిణీ స్రీలకు (pregnant ladies) లయన్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం అన్న దానం చేశారు. ఈ సందర్బంగా మండల వైద్యాదికారిణి సూర్య శిల్ప మాట్లాడుతూ గర్భిణీ మహిళలు పౌష్టికహారం తీసుకొని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించా లన్నారు.లయన్స్ క్లబ్ Lions Club)వారు ప్రతి మంగళవారం గర్భిణీ మహిళలకు అన్నదానం చేయడం అభినం దనీయమన్నారు.
ఈ కార్యక్రమం లో సూపర్ వైజర్లు దయామణి, మరియా, పి హెచ్ఎన్ రాము లమ్మ,అన్నదాత ఆకవరం నవీన్ కుమార్-మల్లేశ్వరి దంపతులు, లయన్స్ క్లబ్ చార్టర్ ప్రసిడెంట్ బుడిగె శ్రీనివాసులు, లయన్స్ క్లబ్ కోశాధికారి వడ్లకొండ బిక్షం గౌడ్, ప్రతినిధులు దునక వెంకన్న, గుండ్ల రామ్మూర్తి,ఏఎన్ఎం నాగమణి, సౌజన్య,సువర్ణ, సరస్వతి,ఆశా వర్కర్లు బల్లెం నవనీత, అన్సార్, రేణుక, తదితరులు పాల్గొన్నారు.