heatstroke : వడదెబ్బ నుండి ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి
-వైద్య ఆరోగ్య శాఖతో ఇతర శాఖ లు చర్యలు చేపట్టాలి --ఆసుపత్రులు,పిహెచ్ సిలు, అంగ న్ వాడిలు,పని ప్రదేశాలలో ఓఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలి -- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
heatstroke : ప్రజా దీవెన, నల్లగొండ: వేసవి తీవ్ర తను దృష్టిలో ఉంచుకుని ప్ర జలు వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు.అధిక ఉష్ణోగ్రతల కారణంగా జిల్లా లో ఎవరు వడదెబ్బకు గురికాకుండా వై ద్యారోగ్య శాఖతో పాటు, ఇ తర శ ఖల అధికారులు వడదెబ్బ నివారణపై వారి వారి ప్రణాళికకు అనుగు ణంగా వేసవి తీవ్రత సమయంలో చేయదగినవి, చేయకూ డని వాటి గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయాలని ఆదే శించారు.
శనివారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రజలు వడదె బ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించేలా విస్తృత అవగాహన క ల్పించాలని అన్నారు. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల సాధారా ణానికి మించి ఉష్ణోగ్రతలు నమోద వుతూ, తీవ్రమైన వేడిమితో కూ డిన ఎండలు ఉన్నందున ప్రజలు త ప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. మధ్యాహ్నం సమయంలో వీలైనంత వర కు ఇంట్లోనే ఉండాలని, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే టోపీ ధరించడం, తలకు తువ్వాలు చుట్టుకోవడంవంటి జాగ్ర త్తలు తీసుకోవాలని సూచించారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయా లలో సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయవద్దని, చల్లదనాన్ని అందించే నీడ ప్రదేశాలలో ఉండాలని అన్నారు.
సాధారణ సమయాలకంటే వేసవి లో ఎక్కువ మోతాదులో మంచి నీ రు,మజ్జిగ,పళ్ళ రసాల వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకో వా లని, నీటిని ఎక్కువగా తీసుకో వా లని, సులభంగా జీర్ణమయ్యే ఆ హా రాన్ని భుజించాలని, తేలికపాటి కా టన్ వస్త్రాలను ధరించా లని చెప్పారు.త్వరగా వడదెబ్బకు లోన య్యే స్వభావం కలిగిన వారు విధిగా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యం గా వృద్ధులు, చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల ని తెలిపారు.
ఆయా కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, సముదాయా లలో పనిచేసే ఉద్యోగులు, కార్మికు లు వేడిమి తీవ్రత వల్ల వడదెబ్బ కు లోను కాకుండా తగిన ఏర్పాట్లు చే యాలని కలెక్టర్ చెప్పారు. ఉపాధి హామీ కూలీలు ఉదయం వేళల్లోనే పనులు చేసేలా చూడాల ని, పని ప్రదేశాలలో తప్పనిసరిగా నీడనిచ్చే లా షామియానాలు, తాగునీటిని, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధి కారులను ఆదేశించారు.
అన్ని ఆసుపత్రులు, ప్రా థమిక ఆరోగ్య కేం ద్రాలు, పి.హెచ్.సీలలో వైద్యాధికారులు, సిబ్బంది అందరూ అప్ర మ త్తంగా ఉంటూ, వడ దెబ్బ నివారణ ఔషధాలు సరిపడా అందుబాటు లో ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రజలు ఎవరైనా వడదెబ్బకు గు రై తే వెంటనే వారిని సమీపంలోని ప్ర భుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే, తక్షణ చికిత్స చేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు.