Heavy Rains: తెలంగాణలో తెగబడిన’వరుణుడు’
దంచి కొడుతున్న ఎండలకు వరుణుడు కాసంత అడ్డుపడ్డాడు. మండుతు న్న ఎండలతో చెమట, ఉక్కబోత నుంచి మంగళవారం సాయంత్రం పడిన వర్షం ఊరటనిచ్చింది. తెలం గాణ వ్యాప్తంగా కొన్నిచోట్ల ఆ ఊర ట స్థాయిని దాటించేసి ఉక్కిరి బిక్కి రిచేసింది.
హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం
రోడ్లపై మోకాలిలోతు నీళ్లతో ట్రాఫి క్ ఇక్కట్లు
విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంత రాయం
తడిసి ముద్దైన ధాన్యం రైతన్న దిగాలు
పిడుగుపాటుకు ఒకరు,గోడకూలి ఇద్దరు, విద్యుదాఘాతంతో ఒకరి మృతి
కరీంనగర్‌లో సీఎం సభ వర్షార్ప ణం
ప్రజా దీవెన, హైదరాబాద్: దంచి కొడుతున్న ఎండలకు వరుణుడు కాసంత అడ్డుపడ్డాడు. మండుతు న్న ఎండలతో చెమట, ఉక్కబోత నుంచి మంగళవారం సాయంత్రం పడిన వర్షం ఊరటనిచ్చింది. తెలం గాణ వ్యాప్తంగా కొన్నిచోట్ల ఆ ఊర ట స్థాయిని దాటించేసి ఉక్కిరి బిక్కి రిచేసింది. వేసవి మధ్యలో మండే ఎండల మధ్య వడగళ్లతో కూడిన జోరువాన వర్షాకాలాన్ని, ఈదురుగా లుల తీవ్రతతో శీతాకాలాన్ని గుర్తు కుతెచ్చి జనాలను వణికించింది. రైతుకైతే మరోమారు దిగాలు మిగి ల్చింది.
ఉరుములేని పిడుగులా విరుచుకుపడ్డ వానకు కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయి, వరదలో కొట్టుకుపో యింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట వాలిపోయింది. తోటల్లోని మామిడి కాయలు నేల రాలడంతో మామిడి రైతుల లాభాల ఆశలన్నీ రాలిపోయాయి. పలుచోట్ల చెట్లు కూలాయి. స్తంభాలు పడిపోవడం తో పాటు గాలిదుమారానికి ఇళ్ల పైరేకులుఎగిరిపోయాయి. హైదరా బాద్, కరీంనగర్, ఆసిఫాబాద్, ములుగు, హుజూరాబాద్, పెద్దప ల్లి, ఖమ్మం, మెదక్, నల్లగొండ, యాదాద్రి, వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల మంగళవారం సాయం త్రం భారీ వర్షం పడింది.
హైదరా బాద్‌లో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం సాయంత్రం దాకా చెమటలు కక్కించిన ఎండ ఆ తర్వాత వణికించిన వానతో నిప్పులు చిమ్మే ఎండల మధ్యలో సాయంత్రం 4:30 గంటలకు వాతా వరణం ఒక్కసారిగా మారిపోయి మబ్బులు పట్టి చల్ల గాలులు వీచా యి. ఆ ఆశ్చర్యంలోంచి తేరుకునే లోపే సాయంత్రం 5:30 నుంచి ఉరు ములు, మెరుపులు తీవ్రమైన గాలు లతో ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు వర్షం పడింది. రెండేరెండు గంటల్లో మియాపూ ర్‌లో 10.8 సెం.మీ, కూకట్‌పల్లిలో 10.7 సెం.మీ, చందానగర్‌లో 9.3 సెం.మీ, యూసుఫ్‌గూడలో 8.6 సెం.మీ, సికింద్రాబాద్‌లో 8.4 సెం.మీ, లింగపల్లిలో 8.3 సెం.మీ వర్షంపడింది. పొద్దున మండే ఎండ లో ఉసురూమంటూ కార్యాలయా లకు వెళ్లిన ఉద్యోగులు, సాయంత్రం ఇళ్లకు వెళుతూ వర్ష బీభత్సానికి ఉక్కిరిబిక్కిరయ్యారు. జోరువానకు క్షణాల్లో రోడ్ల మీద మోకాలిలోతులో నీళ్లు చేరాయి.
రాజ్‌భవన్ రోడ్డు, సచివాలయం ఎదుట, బేగంపేట నుంచి పంజాగుట్ట ఫ్లై ఓవర్ ఎక్కేచోట, ఫిల్మ్‌నగర్ చౌరస్తా, ఖైరతాబాద్ ముద్రణాలయం వద్ద భారీగా వర్షపునీరు నిలిచిపో యింది. వాహనాలు ముందుకు కదలకపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ప్రత్యేకించి ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బం దిపడ్డారు. భారీగా చేరిన వరద నీరు, పొంగిపొర్లుతున్న మ్యాన్ హోళ్ల మధ్య పూర్తిగా తడిసిపోయి న స్థితిలో రోడ్లపై ముందుకూ వెన క్కు వెళ్లలేక గోస పడ్డారు. వరద ఉధృతికి బాచుపల్లి పార్కింగ్ చేసిన కార్లు మునిగిపోయాయి. వర్షానికి బీభత్సమైన గాలి తోడవడంతో చెట్లు కూలి రోడ్ల మీదపడ్డాయి. అమీర్‌పేట, సికింద్రాబాద్, పంజా గుట్ట, కూకట్‌పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, బాలానగర్ తదితర చోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఎప్పుడో సాయంత్రం ఐదింటికి ఇళ్లకు చేరాల్సిన వాహనదారుల్లో ఎక్కువ మంది 9 గంటలకు ఇళ్లకు చేరారంటే ట్రాఫిక్ ఏ స్థాయిలో నిలి చిపోయిందో అర్థం చేసుకోవచ్చు. శేరిలింగంపల్లి, చందా నగర్, కూక ట్‌పల్లి, ఖైరతాబాద్, షేక్‌పేట, బీకే గూడ తదితర చోట్ల లోతట్టు ప్రాం తాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీటిని తొలగించేందుకు డిజాస్టర్ బృందాలు రంగంలోకి దిగాయి. 74 ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచిపోయిందని గుర్తించిన సిబ్బం ది తొలగింపునకు చర్యలు చేపట్టా రు. భారీ వర్షం కారణంగా హైదరా బాద్‌లో పలుచోట్ల 4గంటల మేర విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరా యం కలిగింది. అత్తాపూర్, మణి కొండ పంచవటి కాలనీ, ఎస్సార్ నగర్, బీకేగూడ, బీహెచ్‌ఈఎల్, కుత్బుల్లాపూర్, యూసుఫ్‌గూడ, గణపతి కాంప్లెక్స్, శ్రీనగర్ కాలనీ, హైదర్‌గూడ, కూకట్‌పల్లి, మియా పూర్, శేరిలింగంపల్లి, ముషీరాబా ద్, నారాయణగూడ, దుండిగల్, కవాడిగూడ తదితర ప్రాంతాల్లో గంటకొద్దీ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
గాలివాన మెట్రో నూ వణికించింది. అధికారుల ఆదే శాల మేరకు 20–30 నిమిషాల మేర మెట్రో రైళ్లను నిలిపివేశారు. కాగా నల్లగొండ జిల్లా కనగల్, బొమ్మలరామారంలో 7.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. మంగళ వారం కొంత మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. అయితే వనపర్తి జిల్లా కేతేపల్లిలో 45.5 డిగ్రీలు, నాగర్‌కర్నూలు జిల్లా బీజేపల్లిలో 44.8 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా బిచ్కుంద, నిజామాబాద్ పట్టణంలో 44.7, నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లో 44.3, నిజామాబాద్ జిల్లా పెర్కిట్‌లో 43.7 ఉష్ణోగ్రత నమోదైంది. అకాల వర్షాలపై సీఎం రేవంత్ మంగళవారం రాత్రి సమీక్ష జరిపారు. మునిసిపల్, పోలీసు, విద్యుత్తు అధికారులతో సమీ క్షించారు. హైదరాబాద్ రహదా రులపై నిలిచిన నీటిని తక్షణమే తొలగించేందుకు చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగ కుండా చూడాలని, స్తంభాలు కూలిన చోట తక్షణం పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని సూచిం చారు.
Heavy rains in Telangana