Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

భాగ్యనగరం తడిసిముద్ద

తెలం గాణ లో అనుకున్న సమయానికి ముందుగా నే నైరుతి రుతుపవనా ల రాకతో రాష్ట్రాన్ని తొలకరి పల కరించింది. పలు జిల్లాల్లో బుధ వా రం భారీ వర్షాలు కురిశాయి.

కుండపోతతో గంటలకొద్దీ ట్రాఫిక్ నరకయాతన
బేగంబజార్ లో 8.8 సెం.మీ. నల్ల గొండ జిల్లా మద్దిరాలలో 5, చౌటు ప్పల్ లో 4 సెం.మీ.
మైత్రీవనంలో మునిగిన కార్లు, బైక్ లు, ఎర్రమంజిల్ లో తెరుచుకోని మెట్రో తలుపులు
భద్రాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో పిడు గు పడి ఇద్దరు మృతి,గుట్టపై నుం చి రాయిపడి చిన్నారి దుర్మరణం
రాబోయే వచ్చే 2 రోజులు వర్షాలే వర్షాలు

 

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ లో అనుకున్న సమయానికి ముందుగా నే నైరుతి రుతుపవనా ల రాకతో రాష్ట్రాన్ని తొలకరి పల కరించింది. పలు జిల్లాల్లో బుధ వా రం భారీ వర్షాలు(Heavy rains)కురిశాయి. ము ఖ్యంగా సాయంత్రం సమయంలో గంటన్నర పాటు కుండపోత వాన తో హైదరాబాద్ తడిసి ముద్ద యింది. ప్రధాన రహదారులను వరద ముంచెత్తింది. బేగంబజార్ లో అత్యధికంగా 8.8, బండ్లగూడ లో 8.1, సర్దార్ మహల్లో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నల్ల గొండ(Nalgonda) జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం పడింది. సూర్యాపేట జిల్లా మద్దిరాల 5 సెంమీ, యాదాద్రి జిల్లా చౌటుప్పల్ 4 సెం.మీ లో రెండు గంటల పాటు ఎడతెరిపి లేని వాన కురిసింది. వలిగొండలో మోస్తరు వర్షం పడింది. సంగారెడ్డిలో ఉరు ములు, మెరుపులతో గంటసేపు జలమమయ్యాయి.

నాలుగు గంటలు నరక యా తన.. భారీ వర్షం హైదరాబాద్ లో వాహనదారులను నరక యాతన పెట్టింది. హయత్ నగర్ నుంచి కూ కట్ పల్లి వరకు, ఉప్పల్ నుంచి గచ్చిబౌలి దాక కిలోమీటర్ల మేర వాహనాలు భారీగా బారులు తీరా యి. మైత్రీవనం చౌరస్తాను వరద ముంచెత్తింది. కార్లు, ద్విచక్ర వాహ నాలు సగానికిపైగా మునిగాయి. రెండు గంటలకు పైగా ట్రాఫిక్ జామ్(Traffic jam)కాగా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ సమస్య కొన సాగింది. బేగంబజార్, బండ్ల గూడ, కూకట్ పల్లి, యూసుఫగూడ, కృష్ణా నగర్, ఖైరతాబాద్, విజయ్ నగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాం తాల్లో లోతట్టు ప్రాంతాలు జలమ యమయ్యాయి. గచ్చిబౌలి, కూకట్ పల్లి మోతీనగర్, బాచుపల్లి, శేరి లింగంపల్లి, బేగంబజార్ లో విద్యు త్తుకు అంతరాయం ఏర్పడింది.

ప్రయాణికులకు మెంటల్ లేపిన మెట్రో…. వర్షం నేపథ్యంలో ప్రజ లు మెట్రో రైల్ వైపు మొగ్గు చూపా రు. పరిమితికి మించడంతో ఊపి రాడక ప్రయాణికులు ఉక్కిరి బిక్కిర య్యారు. రాత్రి 10.30 వరకు రద్దీ కొనసాగింది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్తున్న సర్వీస్ ఎర్రమంజిల్ స్టేషన్లో ఆగాక 10 నిమిషాలు డోర్లు తెరుచుకోలేదు. ప్రయాణికులు డొర్లు కొడుతూ కేకలు వేయడంతో ఆందోళన నెలకొంది. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇక్క డ సమస్య పరిష్కరించినప్పటికీ సిగ్నలింగ్ ఇబ్బందితో మిగతా రైళ్లు నెమ్మదిగా నడిచాయి. ఎల్బీనగర్ స్టేషన్ లో రాత్రి ఫ్లాట్ఫారంలపై నుంచి బయటకు వెళ్లే మెషిన్లు పనిచేయకపోవడంతో 20 నిమి షాలు ప్రయాణికులు అక్కడే వేచి చూడాల్సి వచ్చింది.

మామిడి చెట్టుపై పిడుగుతో బాలుడు మృతి.. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం సీతానగరం గ్రామానికి చెందిన బదిర బాలుడు మేకల సంతోష్ (13) పిడుగుపాటుతో చనిపోయా డు. సమీప బంధువులు గొగ్గల రంజిత్, శివశంకర్, శివశంకర్ తో మామిడి చెట్టు నీడలో ఆడుకుం టూ కాయలు సేకరిస్తుండగా అక స్మాత్తుగా గాలి, ఉరుములు, మెరు పులతో వర్షం కురిసి పిడుగుప డింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సంకేపల్లిగూడలో బేగరి వెంకటయ్య (45) పిడుగుపాటుతో చనిపోయాడు. చేవెళ్ల మండలం గుండాలకు చెందిన ఇతడు పని కోసం షాద్ నగర్ వచ్చాడు.

సంగా రెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరె డ్డిపల్లిలో(Nagireddipalli)పిడుగు పడి ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం కొత్తగూడెం లో పిడుగు పడి మూడు ఎద్దులు, నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పూల్యాతండా,నీరుటువానిగూడెంలో 20 మేకలు మృత్యువాత పడ్డా యి. ఇదిలా ఉండగా ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిపై రాయి పడి మృతి చెందిన ఘటన హైదరాబాద్ మంగళహట్ లో చోటుచేసుకుంది. ఆళ్లబండ గుట్టలో బిహార్ కు చెంది న మహ్మద్ షౌకత్ భార్య తంజీర్ బేగంతో జీవిస్తున్నాడు. మంగళవా రం అర్ధరాత్రి భారీ వర్షానికి గుట్టపై నుంచి దొర్లిన బండరాయి షౌకత్ కూతురు (2)పై పడడంతో తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.

ఐదు జిల్లాలకు భారీ వర్షాలు.. నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon)తెలంగాణ లోని నారాయణపేట, ఏపీలోని నర్సాపూర్ మీదుగా వెళ్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో కర్ణాటకలోని ఇతర ప్రాంతాలు, తెలంగాణ, కోస్తాంధ్రలోని మరికొన్ని ప్రాంతాల్లో ప్రవేశించ వచ్చని వెల్ల డించింది. వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లా ల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకా శం ఉందని తెలిపింది. నల్లగొండ, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగా రెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా పది సెం టీమీటర్ల లోపు వర్షాలు కురవొచ్చని చెప్పింది.

Heavy rains in Telangana