Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

High court : మాగనూర్ ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టు ఆగ్రహం..

మాగనూర్ ఫుడ్ పాయిజన్‌పై హై కోర్టు ఆగ్రహం

ప్రజా దీవెన, హైదరాబాద్: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా అంటూ హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా సీరియస్ అంశమని సీజే ధర్మాసనం అభిప్రాయపడింది.

కాగా, ఫుడ్ పాయిజన్‌పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ దా ఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యా జ్యంపై హైకోర్టులో బుధవారం విచా రణ జరిగింది.ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు చనిపోతే కానీ స్పందించరా అంటూ హైకోర్టు సీజే ధర్మాసనం ప్రభుత్వం తరఫు న్యా యవాదిని ప్రశ్నించింది. అధికారుల నిర్ల క్ష్యానికి ఇది నిదర్శనమని మండి పడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవ డం లేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంఘ టనపై వారంలోగా కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వ న్యాయ వాదిపై హైకోర్టు సీజే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడా నికి వారం వ్యవధి ఎందుకని సీజే ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికా రులు పనిచేస్తారా అంటూ ఆగ్ర హించారు. నాన్‌ బెయి లబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో అధికారులు హాజరవుతా రని చురకలు అంటించారు. అధికా రులకు కూడా పిల్లలు ఉన్నారు కదా అని ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. అధి కారు లు మానవతా దృక్పథంతో వ్యవ హరించాలని ఉన్నత న్యాయ స్థానం చెప్పింది.

భోజన విరామం తర్వాత ఈ ఘటనకు సంబంధిం చిన పూర్తి వివ రాలు అందిస్తామని హైకోర్టుకు ఏఏజీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాల ల్లో తరచూ భోజనం వికటిస్తోందని హైకో ర్టుకు చిక్కుడు ప్రభాకర్ తెలిపారు.

High court