Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

HSRP Old Vehicles : పాత “వాహనాల” కు హై సెక్యూరిటీ

— నంబర్ ప్లేట్ లు మార్చాల్సిందే

–ఉత్తర్వులు జారీ చేసిన రవాణాశాఖ

–2019 కంటే ముందు కొనుగోలు చేసిన వాటికి తప్పనిసరి

–సెప్టెంబర్ 30 వరకు తుది గడువు

–నల్లగొండ జిల్లాలో 15 ఏండ్లు దాటిన వాహనాలు 342744

HSRP Old Vehicles :ప్రజాదీవెన నల్గొండ బ్యూరో :నకిలీ నెంబర్ ప్లేట్లను అరికట్టడం, రహదారి భద్రతల పై సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అన్ని రకాల వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు (హెచ్ఎస్ఆర్ పి) తప్పనిసరి చేస్తూ.. రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు కొనుగోలు చేసిన వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేకుంటే ఇకపై రోడ్డుపై నడిపేందుకు అవకాశం లేదు. కాలపరిమితి ముగిసిన వాహహనాల నంబర్ ప్లేట్ల పైనా నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు జిల్లా రవాణాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని రకాల పాత వాహనాలకు ఇప్పుడున్నవి కాకుండా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని రవాణా శాఖ అదేశాలు జారీ చేసింది. దీనికి తుది గడువు సెప్టెంబర్ 30గా ప్రకటించింది. లేని పక్షంలో భారీ జరిమానాలు, శిక్షలు వేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. వీటిని అమర్చుకునేందుకు ప్రత్యేక రుసుములు ప్రకటించారు. వాహనాల తీరు ఆధారంగా ధరలు నిర్ణయించింది. నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డు కట్ట వేయడంతో పాటు రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకొని రవాణాశాల కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది.

–పటిష్ట చర్యలు..

నిర్దేశిత గడువు నిండిన వాహనాలు రోడ్డుపై నడవకుండా ఉండేందుకు రవాణాశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుంది. 15 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన వాహనాలను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. నిర్ణీత కాల పరిమితి ముగిసిన వాహనాలు వేర్వేరు నంబర్ ప్లేట్ల పై తిరుగుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. అనేక వాహనాలకు సకాలంలో సామర్థ్యం పరీక్షలు చేయడం లేదు. ఇక నుండి ఇలాంటి వాటికి అడ్డుకట్టు పడనుంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2018 డిసెంబర్ 31 నాటికి 382903 వాహనాలు ఉండగా 2025 సంవత్సరంలో నేటి వరకు 516323 వాహనా
లతో మొత్తం 899226 వాహనాలు, 15 సంవత్సరాలు పైబడిన వాహనాలు 342744 ఉన్నాయి. జిల్లా రవాణాశాఖ కార్యాలయాల పరిధిలో నిత్యం సుమారు నాన్ ట్రాన్స్పోర్ట్ 50, ట్రాన్స్పోర్ట్ 20 వాహనాల రిజిస్ట్రేషన్లు జరగుతున్నాయి.
సాధారణ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు సుమారు నాలుగు లక్షల పైగా ఉంటాయని సమాచారం.

–చెల్లించే రుసుము ఇలా…

హై సెక్యూరిటీ నంబర్ ప్లేటికు చెల్లించే రుసుములు ఇలా ఉంది. ద్విచక్రవాహనం 320 నుండి 360 రూపాయలు, త్రిచక్రవాహనాలు 350నుండి 450, కార్లు 590 నుండి 700 వరకు, కమర్షియల్ వాహనాలు 600 నుండి 800 చెల్లించాల్సి ఉంటుంది.

–నంబర్ ప్లేట్ మార్పు ఇలా…

పాత వాహనానికి కొత్తగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేటు పొందాలంటే వాహనదారుడే నేరుగా ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి.www.siam.in అనే వెబ్సైట్లో కి వెళ్లి వాహనం నెంబర్, ఫోన్ నంబర్, వాహన రకం, కంపెనీ, జిల్లా తదితర వివరాలు నమోదు చేయాలి. నంబర్ ప్లేట్ షోరూం వివరాలు వస్తాయి. వెంటనే షోరూలకు వెళ్లి వాహనానికి అమర్చుకొని ఫోటో ను తీసి మరోసారి వెబ్ సైట్ లో ఎంటర్ చేయాల్సిన బాధ్యత వాహనదారుడి పైనే ఉంటుంది.కాగా ఇదిలాఉండగా, నిరక్షరాస్యులు, స్మార్ట్ఫోన్ లు లేని వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

–2018 డిసెంబర్ 31వ తేదీకి ముందు వాహనాల వివరాలిలా..

ఆటోలు 18442, గూడ్స్ 11093, మోటార్ కార్ 19328, మోటార్ సైకిల్ 281279, ట్రాక్టర్లు 12173, ట్రైలర్ 8386, ఇతర వాహనాలు 32201 ఉన్నాయి.

–2019 జనవరి నుంచి నేటి వరకు వాహనాలు…

ఆటోలు 29901,గూడ్స్ 17179, మోటార్ కార్ 30304, మోటార్ సైకిల్ 355302, ట్రాక్టర్లు19589, ట్రైలర్ 12168, ఇతర వాహనాలు 19679 ఉన్నాయి.