–దురాశ తోనే విలువలకు తిలోదకాలు
–మనిషిని అన్ని రకాలుగా దెబ్బతీసేవి అవే
— కామ దహనంలో కాల్చేయకుంటే మనిషినే కాల్చేస్తుంది
–నేడు హోలీ సందర్భంగా ప్రజాదీవెన ప్రత్యేక కథనం
Holi : ప్రజాదీవెన నల్లగొండ : హోలీ వచ్చిందంటే చాలు పిల్లలు, పెద్దలకూ సంబురమే. రంగులు చల్లుకుంటూ సంతో షంగా గడుపుతారు. ముఖంపై ఆ చిరునవ్వు నిత్యం ఉండాలంటే మాత్రం మన ఆలోచనల
రంగు మార్చాలని కాలం చెబుతోంది. కామ దహనంలో పాత వస్తువులను దాహనం చేసినట్లు మనిషి జీవితాన్ని కుంగదీస్తున్న ప్రతి కూల ఆలోచనలు, స్వభావాలను దహించాల్సిన అవసరముంది. అప్పుడే ముఖంపై కనిపించే సంతోషంలో స్వచ్ఛమైన ఆలోచనలు, వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. ఈ నేపథ్యంలో హోలీ కామదహనంలో వేయాల్సిన లక్షణాలు ఏంటో ప్రజాదీవెన ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
దురాశ…
ఒత్తిడి, అసంతృప్తి, కాఠిన్యం,
నైతిక విలువలకు తిలోదకాలివ్వడం వంటివి పెరుగుతాయి. దురాశను వదులుకుంటే ఈ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
ద్వేషం..
నిద్రలేమి, కుంగుబాటు, ప్రవర్తనలో మార్పు, సంబంధాలు దెబ్బతినడం, అశాంతి వంటివి వేధిస్తాయి. అందరితో ప్రేమగా మసలుకుంటే చాలు కుటుంబ, సామాజిక సంబంధాలు బలపడతాయి.
వ్యసనం…
మానసిక, శారీరక, ఆర్దికపర
మైన నష్టాలకు కారణమవుతుంది. ఫోన్, మత్తు పదార్థాల అలవాటు, జూదం మనిషిని అన్ని రకాలుగా దెబ్బతీస్తుందని గ్రహించాలి. వ్యసనాలకు దూరమైతే ఆరోగ్యంగా ఉండటమే కాదు ఆర్ధికంగానూ ఎదుగుతారు.
వ్యామోహం…
మనిషిలో ప్రతికూల ఆలోచనలు, దుష్ప్రవర్తన, వివాహేతర సంబంధాలు, విలువలు, నిర్ణయశక్తిని కోల్పోవడం వంటివి వేధిస్తాయి. దీనికి దూరంగా ఉంటే ఉత్తమ పౌరుడిగా గుర్తింపు లభిస్తుంది.
అసూయ…
ఇది మనిషిలో అభద్రతాభావం, అనుమానం, అందో ళన వంటి వాటికి కారణమవు తుంది. అందుకే ఏ విషయంలో అసూయ పడుతున్నామో విశ్లేషించుకుని ఎదుటి వారి నుంచి ప్రేరణ పొందడానికి ప్రయత్నించాలి.
విరక్తి…
ప్రతికూల ఆలోచనలు, అసంతృప్తి, వైరాగ్యం, సాంఘిక జీవనం కోల్పోవడం, భయం, భావోద్వేగాలకు దూరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక్కడ సమాజం, కుటుంబం ఈ విరక్తి భావన ఉన్న వారిని గుర్తించి ఆశాబావ దృక్పథం పెంపొందించాలి.
ఆవేశం…
తన కోపమే తనకు శత్రువంటారు.
అలాగే ఈ కోపం మానసికంగా ఒత్తిడి, స్వీయహాని, శారీరకంగా రక్తపోటు, ప్రవర్తనపరంగా భౌతికదాడులు, తిట్ల దండకం వంటి దుష్ప్రభావాలకు కారణమవుతుంది. ఆగ్రహాన్ని వదులుకుని నిగ్రహాన్ని పెంచుకుంటే ముఖంలో శాంతి వికసిస్తుంది.
కామదహనంలో కాల్చేస్తేనే మంచిది…
ప్రస్తుత సమాజంలో చోటుచేసుకుంటున్న నేరాల వెనుక ఉంటున్న ప్రధాన కారణాలు పైన పేర్కొన్నవే. మనిషి ఆలోచనల విధానంలో కొత్తదనం అంటే దృష్టి కోణం (రంగు) మార్చు కుంటే నేరాల సంఖ్య తగ్గించొచ్చు. ముఖ్యంగా నేర స్వభావాన్ని పెంపొందించే దుర్లక్షణాలను కామదహనంలో కాల్చేస్తే మంచిది. లేదంటే అవి మనల్ని దహించివేస్తాయని గ్రహించాల