–కుల మతాలకు మతసామరస్యానికి ప్రతీక హోలీ
Holi celebrations : ప్రజా దీవేన ,:కోదాడ పట్టణంలోని హానిక భవానినగర్ ముడియాల భరత రెడ్డి వీధిలో భవానినగర్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం రంగుల హోలా హోలీ సంబరాన్ని అంబరాన్ని అంటే విధంగా హోలీ సంబరాలను నిర్వహించారు.హోలీ జరుపుకోవడం యూత్ సభ్యులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఘనంగా నిర్వహించిన హోలీ సంబరాలలో ప్రతి ఒక్కరు ఆనంద సంతోషాలతో హోలీ వేడుకలు జరుపుకోవాలని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవించాలని అదేవిధంగా హోలీ పండుగ సందర్భంగా యువత ఆడంబరాలకు గాని యువత వేగంగా బైకులు నడపటం విన్యాసాలు చేయటం వంటివి చేయకుండా ఇంటి వద్ద స్నేహితులు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా పండుగను జరుపుకోవాలని కోరారు.
కుల మతాలకు మతసామరస్యానికి ప్రత్యేకగా హోలీ ప్రతి ఒక్కరు జరుపుకోవాలని అన్నారు. చిన్న పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ హోలీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో చిల్లంచర్ల వెంకటేశ్వర్లు,తాటి మురళి, సామినేని రామకృష్ణ,కోట నాగరాజు,ప్రశాంత్,పుల్లయ్య,భవాని నగర్ బాయ్స్ యూత్ సభ్యులు మాతంగి గగన్ తేజ్,తాటి సంజయ్,నిఖిల్,చైతన్య రెడ్డి, భువన,హర్షిత్ గుప్తా,గణేష్,అజీజ్,అఖిల్,ఉదయ్,భవిత్,నవనీత్,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.