–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi : ప్రజాదీవెన, నల్గొండ: నల్గొండ లాంటి జిల్లాలో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా, ఇంచార్జ్ ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేసి పదవి విరమణ పొందడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఉదయాదిత్య భవన్ లో నిర్వహించిన సిపిఓ మాన్య నాయక్ పదవి విరమణ సన్మాన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఇటు సిపిఓగా, అటు ఈడి ఎస్ సి కార్పొరేషన్ గా ప్రత్యేకించి రాజీవ్ యువ వికాసం కింద ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు స్వీకరించేందుకు కృషి చేసిన సిపిఓ అభినందనీయులని అన్నారు.
నల్గొండ లాంటి పేద జిల్లాలో పేద ప్రజల కోసం పనిచేయడం సంతోషకర మన్నారు.పదవి విరమణ తర్వాత శేష జీవితం ప్రశాంతంగా గడపాలని ఆమె ఆకాంక్షించారు.ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ రాజకుమార్, జెడ్పి సీఈవో ప్రేమ్ కరన్ రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్, నూతన సిపిఓ శామ్యూల్, పరిశ్రమల శాఖ జీఎం కోటేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు.