HorrificRoadaccidentATYadadri : యాదాద్రియాదాద్రిభువనగిరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదo, ముగ్గురు దుర్మరణం
యాదాద్రిభువనగిరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదo, ముగ్గురు దుర్మరణం
HorrificRoadaccidentATYadadri: ప్రజా దీవెన చౌటు ప్పల్: జాతీయ రహదారి 65 పై యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమా దం చోటుచేసుకుంది. యాదాద్రి భు వనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం జాతీయ రహదారి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలోఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఆంధ్రా సె క్యూరిటీ వింగ్ స్కార్పియో అదుపు తప్పి డివైడర్ ను డీకొనడంతో ఈ ప్రమా దం సంభవించింది.
ఈ ప్రమాదంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు డిఎస్పీలు చక్రధర్ రా వు, డిఎస్పి శాంతారావు , మరొకరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డ్రై వర్ నర్సింగ్ రావు కు తీవ్ర గాయాల పాలయ్యారు. మెరుగైన చికిత్స కోసం హైద రాబాద్ కామినేని ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న క్రమంలో చౌటుప్పల్ వద్ద డివైడర్ను ఢీకొని వ్యతిరేక మార్గం వైపు దూసు కెళ్లి లారీని బలంగా డీకోవడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మరింత పూర్తి సమాచారం అందాల్సింది.