HOSPITALS: ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సిద్ధం
HOSPITALS నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
HOSPITALS: ప్రజాదీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని (TALANGANA GOVERMENT) ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, (HEALTH CENTERS)ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయించింది. ఈమేరకు త్వరలో వరుస నోటిఫికేషన్లు (NOTIFICATION)వెలువడనున్నాయి. 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్), 193 ల్యాబ్ టెక్నీషియన్లు, 31 స్టాఫ్ నర్సు పోస్టులకు తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) త్వరలో ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది. ఈ మేరకు ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ సర్కార్ వివిధ ఆస్పత్రులు, విభాగాల్లో ఖాళీలను గుర్తించి వెంటనే భర్తీచేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దీనిలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (HEALTH CENTE) సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. అన్ని ఆస్పత్రుల్లో (HOSPITALS) ఎక్కడెక్కడ ఖాళీ పోస్టులున్నాయో ఆ వివరాలు తీసుకున్న వైద్యఆరోగ్యశాఖ మొత్తం 531 పోస్టులను గుర్తించింది. ఈ పోస్టులను వెంటనే భర్తీచేసేందుకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ (NOTIFICATION) వెలువడనుంది. వైద్యుల పోస్టులతో పాటు 193 ల్యాబ్ టెక్నీషియన్లు, 31 స్టాఫ్‌నర్సుల పోస్టులకు కూడా వేరువేరుగా ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.