Hriday Kumar Reddy : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవర కొండ రోడ్డులోని సెయింట్ ఆల్ఫో న్సస్ హైస్కూల్ని స్థాపించి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని పాఠ శాల ప్రిన్సిపాల్ హృదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకలకు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నార ని తెలిపారు. బుధవారం స్కూల్లో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 60 ఏళ్ల కాలంలో వేలాది మంది విద్యార్థులకు విద్య ను అందించడం సంతోషంగా ఉంద న్నారు.
వక్రోత్స వవేడుకలు సా యంత్రం ఐదున్నర గంటలకు ప్రా రంభమవుతాయని తెలిపారు. పూ ణే ప్రావిన్స్ చైర్మన్, ప్రావిన్షియల్ సుపీరియర్ జైకో గెర్వాసిస్ అధ్య క్షత వహించే ఈ వక్రోత్సవ వేడుకల కు శాస నమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ కుం దూరు రఘువీర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామలకిరణ్ కుమార్ రెడ్డి, హైకోర్టు మాజీ జడ్జి, రెరా అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఏ రాజ శేఖర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుం భం అనిల్ కుమార్ రెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పి శరత్ చంద్ర పవార్లు ప్రత్యేక అతిధులుగా హాజరు కానున్నారని తెలిపారు. మీడియా సమా వేశం లో సెయింట్ ఆల్ఫోన్సస్ ప్రైమరీ స్కూల్ ఇంచార్జి కేథరీన్, పాఠశాల రిటైర్డ్ ఉపాధ్యాయులు నర్సిరెడ్డి, జిలాని, స్పర్జ న్, పాఠశాల ఉపాధ్యాయులు బాలశౌరి రెడ్డి, జయంత్ కుమార్, సుందరి, లూర్డు రెడ్డి, పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఏచూరి భా స్కర్, ప్రధాన కార్యదర్శి నరేం ద్రబాబు ఉన్నారు.