Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hyderabad bond with America: అమెరికాతో బలమైన బంధం

అమెరికాతో హైదరాబాద్ బంధం బలమైందని, రాబోయే రోజుల్లో ఇది మరింత బలోపేతం అవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

అమెరికాతో ప్రజాస్వామ్యమం పరిమళింప జేసింది
అమెరికాలో శరవేగంగా విస్త రిస్తున్న భాష తెలుగు
అమెరికా స్వాతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ప్రజా దీవెన, హైదరాబాద్; అమెరికాతో హైదరాబాద్ బంధం(Hyderabad strong bond with America) బలమైందని, రాబోయే రోజుల్లో ఇది మరింత బలోపేతం అవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. యునైటెడ్ స్టేట్స్ కాన్స్ లేట్ జనరల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన యు.ఎస్ 248 స్వాతంత్ర దినోత్సవ వేడు కలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Deputy Chief Minister Bhatti Vikramarka Mallu)ను ఘనంగా స్వాగతం పలికిన కాన్సిలేట్ జన రల్ జెన్నీ ఫర్ లార్సన్(Consul General Jenny Fur Larson), యు.ఎస్ ఎంబర్సీ రేర్ అడ్మిరోల్ యు.ఎస్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీక రించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రసంగించారు.

ఈ వేడుకలకు తనను ఆహ్వానించిన అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లారెన్స్(American Consul General Jennifer Lawrence) కు ధన్యవాదాలు తెలి పారు. అమెరికా 248వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకర అంశంగా పేర్కొన్నారు. ఇది ఒక చారిత్రాత్మక అంశం, ప్రజా స్వామ్యాన్ని పరిడవిల్లేలా చేసిన అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచం మొత్తానికి పండుగ అని తెలిపారు. భారత దేశానికి వ్యూహాత్మకంగా కూడా అమెరికా మంచి మిత్ర దేశం అన్నా రు. అమెరికా అతి ప్రాచీన, పెద్దదైన ప్రజాస్వామిక దేశమని అభివర్ణిం చారు. అమెరికా స్వాతంత్రం మూ లంగానే మనం ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, హక్కులను అనుభవి స్తున్నామన్నారు. తెలుగు ప్రజలకు అమెరికాతో అవినాభావ సంబంధం ఉందన్నారు.

మన సినిమా షూటిం గులు అమెరికాలో ఎక్కువగా జరుగు తాయి, మన పిల్లలు ఉన్నత చదువులకు అమెరికాకు ఎక్కువగా వెళుతుంటారు, ఉన్న తమైన జీవితం కోసం అక్కడికి వెళుతుంటారు, అమెరికాలో ప్రస్తు తం అతివేగంగా విస్తరిస్తున్న భాష ఏదైనా ఉందా అంటే అది తెలుగు భాష మాత్రమేనని, రాబోయే రోజుల్లో తాను ఇలాంటి వేడుకల్లో తెలుగులోనే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. భారతదేశ ప్రజలు అభివృద్ధి చెందేందుకు అమెరికా అండగా నిలిచిందన్నారు. భారతీయులను అమెరికన్లు సాదరంగా ఆహ్వానించి అక్కడి పౌరులుగా గౌరవ మర్యాదలు ఇస్తారని వారితో సమానంగా చూసుకుంటారని తెలిపారు.

అమెరికా భారత్ మధ్య స్నేహం(Friendship between America and India) విషయానికొస్తే హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. వ్యాపారం, సంస్కృతి వంటి విషయాల్లో తెలంగాణ అమెరికా మధ్య బలమైన బంధం ఉన్నది, ఇవి రోజుకు బలపడి రాబోయే రోజుల్లో హైదరాబాద్ అమెరికాల మధ్య మరింత బలమైన బంధం ఏర్పడుతుందన్నారు. అటు భారత్ ఇటు అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల సంవత్సరం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం భారత్లో ఎన్నికలు ముగియగా రాబోయే సంవత్సరం అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి.. ఆ ఎన్నికల్లో అమెరికాల్లో మంచి ఫలితాలను సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Hyderabad strong bond with America