Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

HYDRA: విల్లాలపై హైడ్రా ఉక్కుపాదం

— ఒకేరోజులో 25 జిల్లాలు 19 భవనాలు నేలమట్టం

HYDRA: ప్రజా దీవెన, సంగారెడ్డి: రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తున్న హైడ్రా (HYDRA)తన దూకుడు మరింతగా పెంచుతుంది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో హైడ్రా చేప‌ ట్టిన చ‌ర్య‌లు చ‌రిత్ర‌లో ఇదే బిగ్ ఆప‌రేష‌న్‌ (Big operation).17 గంటలపాటు నాన్ స్టాప్ కూల్చివేత ప‌నులు చేప‌ ట్టారు. అలాగే ఓ హాస్పిటల్, రెండు అపార్ట్ మెంట్లు కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. పటేల్ గుడాలో 25 విల్లాలు, 19 భ‌వ‌నాలు, అలాగే ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఆస్ప‌త్రిని నేల‌మ‌ట్టం చేశారు. హైడ్రా ఏర్పాటు తర్వాత తొలిసారిగా డే అండ్ నైట్ కూల్చివేతలు జరిగాయి. అక్రమ నిర్మాణాలకు అనుకొని ఉన్న పక్క ఇళ్లకు డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

కూకట్‌పల్లిలో 16 షెడ్లు కూల్చి వేత‌

కూకట్‌పల్లి శాంతినగర్‌లోని (Shantinagar) నల్ల చెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉం ది. ఈ చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లోని దాదాపు నాలుగు ఎకరా ల విస్తీర్ణంలో కొందరు వ్యక్తులు షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కేటరింగ్‌ కోసం కిచెన్‌లు ఏర్పాటు చేశారు. ఇత రత్రా వ్యాపారాలూ సాగుతున్నా యి. వాటిలో పనిచేసే కార్మికులు ఉండేందుకు తాత్కాలిక నివాసాలు నిర్మించారు. ఫిర్యాదుల నేప థ్యం లో పలుమార్లు చెరువును పరిశీ లించిన హైడ్రా అధికారులు (HYDRA officials), నిర్మా ణాలు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. సర్వే నంబర్లు 66, 67, 68, 69లో ఉన్న‌ 16 వాణిజ్య షెడ్లు, ప్రహ రీలను (Commercial sheds, highways) నేలమట్టం చేశారు. ఇం దులో ఐదు కేటరింగ్‌ షెడ్లు, మూ డు ఫ్లెక్సీ ప్రింటింగ్‌ నిర్మాణాలు, రెండు టెంట్‌ హౌస్‌లు, ఆరు గోడౌన్లు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా ఆదివారం కూల్చివేసింది. కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలో సర్వే నంబర్‌ 164లోని ప్రభుత్వ భూమిలో మూడు బహుళ అంతస్తుల భవనాలను హైడ్రా నేలమట్టం చేసింది. వీటిలో ఒకటి ఐదంతస్తుల భవనం కాగా, మరో రెండు భవనాలు నాలుగు అంతస్తులుగా నిర్మించారు. ఇవన్నీ నివాసేతర నిర్మాణాలు.

ఇటీవలే మునిసిపాలిటీలో విలీనమైన పటేల్‌గూడ పంచాయతీ పరిధిలోని బీఎ్‌సఆర్‌ కాలనీ పక్కన ప్రభుత్వ భూమిలో నిర్మించిన 24 వరుస ఇళ్లను కూల్చివేశారు. ప్రభుత్వ సర్వే నంబర్‌ విస్తరించి ఉన్న 12 సర్వే నంబర్‌ భూమి పక్కనే ఉన్న సర్వే నంబర్ 6 లోని పట్టా భూమిలో బిల్డర్లు ఇళ్లను నిర్మించారు. సర్వేలో ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం తేలడంతో హైడ్రా కూల్చివేతలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో కొన్ని కుటుంబాలు నివాసం ఉంటుండగా వారికి హైడ్రా అధికారులు, పోలీసులు నచ్చజెప్పి ఖాళీ చేయించారు.