Hydra Progress Report: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో హైడ్రా (Hydra) యంత్రాంగం చర్యలు ఔరా అనిపిస్తున్నాయి. అక్రమంగా నిర్మించిన కట్టడాలను ఈ హైడ్రా కూల్చి వేస్తున్న క్రమం సామాన్య మధ్యతరగతి ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో పలు సంస్థలు, నిర్మాణాలకు ఇప్పటికే హైడ్రా నోటీసులు జారీ చేసింది. హైడ్రా దూకుడుతో నగరం (Hyderabad city)లోని అక్రమ కట్టడాలు చేసిన వారి గుండెల్లో గుబులు మొదలైంది.
ఈ క్రమంలో గత 20 రోజులుగా నగర వ్యాప్తంగా చేపట్టిన కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా పురోగతి నివేదిక (Hydra progress report) అందజేసింది. ఈ రిపోర్టు ప్రకారం ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా తెలిపింది. ఇందులో పల్లంరాజు, సునీల్రెడ్డి కట్టడాలు, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరి సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు, హీరో నాగార్జున (Nagarjuna)కు చెందిన ఎన్ కన్వెన్షన్ (N Convention) వంటి కట్టడాలను కూల్చి వేసినట్లు రిపోర్ట్‌లో తెలిపింది.
అలాగే లోటస్పాండ్ (Lotuspond), మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజులరామారం, అమీర్పేట్లో పలు నిర్మాణాలకు కూడా నేలమట్టం చేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో తెలిపింది.